క్వయిల్ పెంపకంతో ఆర్ధిక వికాసం

                                                                                                                   
                                                                                                                                                                                                                                                                                 

                    క్వయిల్ పెంపకంతో ఆర్ధిక వికాసం                

                                                                                                                                                                                                                                                                                                                                                   
                             
                                                       
           
 

గ్రామీణ స్థాయిలో వ్యవసాయానుబంధ పరిశ్రమగా క్వయిల్ పక్షుల పెంపకంను తగిన మెళకువలు పాటించి చేపడితే తక్కువ కాలంలో అధిక లాభాలు పొందవచ్చు.

 

క్వయిల్ పక్షులు పెంపకం వల్ల ఉపయోగాలు

 
   
 • ఒక కోడిని పెంచడానికి ఉపయోగించే స్థలంలో 5-8 క్వయిల్ పెట్టలను పెంచడానికి సరిపోతుంది.
 •  
 • ఇవి తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ గ్రుడ్లు పెడతాయి.
 •  
 • ఒక్కో పక్షి ఏడాదికి సుమారు 200-250 వరకు గ్రుడు పెడుతుంది.
 •  
 • విలువైన మాంసకృతులను విటి నుండి పొందవచ్చు
 •  
 • వీటి గ్రుడు, మాంసం వివిధ రుచులలో ఊరగాయల వచ్చడిగా తయారుచేసుకొని, ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చును.
 •  
 

క్వయిల్ పక్షుల లక్షణాలు

 
   
 • ఒక రోజు గల పిల్ల బరువు 6-7 గ్రాములు ఉంటుంది.
 •  
 • పరిపూర్ణముగా అభివృద్ధి చెందిన పక్షి శరీర బరువు ఆడ: 150-200 గ్రా. మగ 140-180 గ్రా. లుగా ఉంటుంది.
 •  
 • మొదటి గ్రుడు పెట్టు నాటికి వయస్సు 6 వారాలుగా ఉండును.
 •  
 • ఎదిగిన పక్షి రోజుకు తినేమేత 25-30 గ్రా.
 •  
 • గ్రుడు బరువు 10-12 గ్రా.లు
 •  
 • గ్రుడ్డు పొదుగు కాలము 16-18 రోజులు
 •  
 • మాంసం ప్రత్యేకతలు : మంచి రుచి, మాంసకృత్తలు ఎక్కువ, కొవ్వ తక్కువ.
 •  
 • గ్రుడ్డు ప్రత్యేకత: మంచి రుచి, బలవర్ధకం, నిల్వ పరచడానికి అనుకూలం, ఎగ్ బోండా తయూరికి అనుకూలం.
 •  
 

క్వయిల్ గ్రుడ్లను పోదిగించడం

 

క్వయిల్ గ్రుడ్లును 16-18 రోజులు పొదిగించి పిల్లలను పొందవచ్చు. కోడిగ్రుడ్లను పొదిగించడానికి ఉపయోగించే పాదిగే యంత్రం (ఇంక్యుబేటర్) ను వీటికి కూడా ఉపయోగించవచ్చు.

 

క్వయిల్ పిల్లల పెంపకం (మొదటి రోజు గుండి నాల్గన వారం)

 

ఎ. గాలి, వెలుతురు : క్వయిల్ పేల్లలకు కల్పించదలసిన గాలి, వెలుతురు, బ్రూడింగ్ విధానం బ్రాయిలర్ కోళ్ళ తరహాలోనే అందించవచ్చు.

 

వి. బ్రూడింగ్

 

సే బ్రూడింగ్ స్థలం : ఉష్ట గొడుగు క్రింద 75x75 చ. సెం.మీ చుట్య స్థలం ప్రతి క్వయిల్ పిల్లకు కేటాయించాలి.

 

 

 

డి. దాణా ఏర్పాటు : ప్రతి క్వయిల్ పిల్లకు దాణా తొట్టి స్థలం 2 నుండి 3 సెం.మీ., నీటి తొట్టి స్థలము 1 నుండి 1.5 సెం.మీ. అవసరము.

 

లింగ భేదము గుర్తించుట : ఆడ, మగ క్వయిల్ మూడు వారాల వయస్ళు నుండి గుర్తించుటకు వీలవుతుంది. 4 వారాల వయస్సులో వీటి తేడా గుర్తించడము మరింత సులభం. మగ క్వయిల్ కు మెడ క్రింది భాగములో గోధుడు రంగు ఈకలు ఉంటాయి. ఆడ క్వయిల్లో అధిక భాగం ఈకలు నల్లని మచ్చలతో ఉంటాయి.

 

గ్రుడ్లు పెట్టే క్వయిల్ల పెంపకం

 

వీటి నివాసానికి కోళ్ళ కొరకు ఉపయోగించే వసతినే ఉపయోగిస్తారు. వాటి వయస్సు పరిమాణము బట్టి 180–250 చ. సెం.మీ. స్ధలము కేటాయించాలి. దాణా తొట్టి 25-3 సెం.మీ. సీట్ తొట్టి 1.5-2 సెం.మీ. ఉండేటట్లు ఏర్పాటు చేయాలి. సాధారణంగా కోడి 75 శాతం గుడ్లు ఉదయం పూట పెడుతుంది. కానీ క్వయిల్స్ మధ్యాహ్నం 3 నుంచి 8 గంటల సమయంలో 75 శాతం గ్రుడ్లు పెడతాయి.

 

మాంసం కోసం క్వయిల్ పక్షులు

 

క్వయిల్ ల పెంపకం మాంసపు రకమునకు గాని, గ్రుడ్ల రకమునకు గాని తేడా లేదు కాని ప్రత్యేకించి అభివృద్ధి పరిచిన క్వయిల్ రకాలను మాంసం కొరకు వాడటం మంచిది. మాంసం కొరకు పెంచే క్వయిల్ ను 6 వారాల వయస్సులోనే మార్కెట్ చేయటము ఉత్తమము. అప్పటికే అవి సుమారు 135-150 గ్రాముల బరువు ఉంటాయి.

 

వ్యాధుల నివారణ

 

క్వయిల్ మొదటి రెండు వారాల వయస్సులో వాతావరణ పరిస్థితుల్ని ముఖ్యంగా చలిని తట్టుకోలేని స్థితిలో ఉంటాయి. అందువల్ల బ్రూడింగ్ దశలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కోళ్ళకు వచ్చే వ్యాధులతో పోలిస్తే వీటికి తక్కువే కాని అదసరాన్ని ఐద్ధి టీకాలు (కొక్కెర తెగులు) మందులు వాడాలి. కోళ్ళకు వచ్చే ఏలిగపాములు (అస్కరీడియా గాలై) వ్యాధి మరియు రక్తపారుడు వ్యాధులకు క్వయిల్ పక్షులు తట్టుకొనగలవు. కాని కొన్నిరకాలైన ఐమీరియా తెగళ్ళ ద్వారా వీటికి రక్తపారుడు రోగం రాదచ్చు. ఈ వ్యాధి నివారజోపాయాలను చేపట్టాలి. 0.2 గ్రాముల 20% అంప్రాల్ సాల్ పాడిని లీటరు నీటితో వారం రోజులపాటు ఇచ్చినచొ రక్తపారుడు వ్యాధి నివారింప బడుతుంది.

 

క్వయిల్ లకు ఆస్పర్జిల్లోసిస్ అనే ఫంగస్ వ్యాధి రావడం కూడా కనిపిస్తుంది. దీని నివారణకు బ్రూడర్ గృహాల్లోని తేమను తగ్గించడంతో పాటు, 2 కిలోల కాల్షియం ప్రాపియోనేట్ ఒకటన్ను దాణాలో కలిపితే ఈ వ్యాధి నుంచి క్వయిల్లను రక్షించుకోవచ్చు.

 

క్వయిల్ లలో వచ్చే మరో ముఖ్యమైన వ్యాధి అల్పరేటివ్ ఎంటరైట్స్ దీని నివారణ కొరకు ఒక గ్రాము ప్రైస్టోమైసిన్, ఎరోసేన్ దుందును ఒక లీటరు నీటిలో కలిపి మూడు రోజుల పాటు త్రాగిస్తే ఈ వ్యాధి నుంచి క్వయిల్ లను రక్షించుకోవచ్చు.

 

ఈ విధంగా క్వయిల్ పెంపకంలో తగిన యాజయాన్య పద్ధతులు పాటిస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చు

 

క్వయిల్ పక్షుల పెంపకంలో వ్యయం - రాబడి చూసినట్లయితే

 

1. ప్రస్తుతం క్వయిల్ పిల్ల ఖరీదు –                              రూ. 6/-

 

2. 6 వారాల దరకు దాణా ఖర్చు –             రూ.15/-

 

3. లేబర్, కరెంట్ చార్టీలు మొదలగునవి -            రూ 4/–

 

మొత్తం రూ.25/–

 

అమ్మకం 6 వారాల వద్ద ఒక్కొక్క క్వయిల్ కు ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 35/- రాబడి = అమ్మకం - వ్యయం = 35-25 = 10/-

 

ఒక్కొక్క క్వయిల్ మీద రాబడి రూ. 10/-వరకు వస్తుంది.

 

ఈ విధంగా రైతుకు వ్యవసాయానికి అనుబంధంగా క్వయిల్ పక్షులు పెంచినట్లయితే 6 వారాల తరువాత నాలుగువేల వరకు రాబడి పొందదచ్చు. కనుక సరియైన యాజమాన్య పద్ధతులు చేపట్టి ఆర్థిక వికాసం పొందవచ్చు.

 

దొరికే స్థలం: కోళ్ళ పరిశోధన స్థానం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ - 500 030

 
                     
                                       
                             
       
     
                       
 
                                                     
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions