ఇ-టికెట్

                                                                                                                   
                                                                                                                                                                                                                                                                                 

                    ఇ-టికెట్                

                                                                                                                                                                                                                                                     

                   ఈ పేజీ  ఐఆర్సిటిసి సైటులో  ఇ-టికెట్ ను ఎలా పొందాలో వివరిస్తుంది                

                                                                                             
                             
                                                       
           
 

ఇ-టికెట్లు  ఎలా కొనాలో  వీడియో ట్యుటోరియల్

 

ఇ-టికెట్లు

 
 
       ఈ వీడియో ఇ- టికెట్లు బుక్ ఎలా వివరిస్తుంది.
 
 

నమోదు ప్రక్రియ

 
   
 • నమోదు ఒక వ్యక్తిగా చేసుకోవాలి . నమోదు ఉచితం.
 •  
 • మీ యూజర్ పేరు మరియు పాస్వర్డ్ నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి.
 •  
 • "ప్లాన్ మై ట్రావెల్ " పేజీ కనిపిస్తుంది.
 •  
 • మీరు ఎంపిక చేసిన నుండి/వరకు స్టేషనులు  అ రైలు మార్గంలో సరిగా ఉంటే తర్వాత:
 •  
 • ఇ-టికెట్ ఎంపికను ఎంచుకోండి.
 •  
 

 
   
 • రైలు జాబితా తెలుసుకునేందుకు, "సమర్పించు" ఎంపికపై క్లిక్కు చేయండి.
 •  
 • అప్పుడు అది ఆమార్గంలో అందుబాటులోని రైళ్ల సంఖ్యను రైళ్ల జాబితాను చూపిస్తుంది.
 •  
 • మీరు మార్గం మరియు సమయాలను తెలుసుకోవాలనుకుంటే, "రైళ్ల జాబితా" ఎంపిక దగ్గర రైలు పేరుపై క్లిక్కు చేయండి.
 •  
 • ఛార్జీలను తెలుసుకోవాలనుకుంటే, "రైళ్ల జాబితా" ఎంపిక దగ్గర  అందుబాటులోని రైలు తరగతిపై క్లిక్కు చేయండి. ఇది తరగతి ఎంపిక ప్రకారం ఛార్జీలను చూపిస్తుంది. కనిపించే ఛార్జీ ఒక వయోజన ప్రయాణికునికి అయ్యే ఛార్జీ మరియు ఐఆర్సిటిసి సర్వీస్ ఛార్జీలు కలుపుకొని చూపిస్తుంది.
 •  
 • రైలు జాబితా నుండి రైలును ఎంచుకోవడానికి, రైలు  తరగతి రకంపై క్లిక్కు చేయండి.
 •  
 

 
   
 • మీరు రైలు జాబితాలో తరగతిని క్లిక్ చేస్తే అది రైలు  లభ్యత మరియు వివరాలను చూపిస్తుంది.
 •  
 • టిక్కెట్లు కొనడానికి, లభ్యత ఆప్షన్ క్రింద "బుక్ నౌ" బటన్ పై క్లిక్కు చేయండి. అప్పుడు మీరు కింది ఎంపికలు చూస్తారు
 •  
 

 
   
 • మీరు వేరే రైలును ఎంచుకోవాలనుకుంటే, "రీసెట్" బటన్ పై క్లిక్కు చేయండి.
 •  
 • టికెట్ రిజర్వేషన్ పేజీ కనిపిస్తుంది; పేజీపైన కనబడుతున్న రైలు పేరు మరియు స్టేషన్ పేర్లు మీకు కావలసినవా కావో తనిఖీ చేసుకొండి.
 •  
 • ప్రతి ప్రయాణీకుని పేరు, వయసు, లింగము మరియు బెర్త్ ప్రాధాన్యతను నమోదు చేయండి. పేర్ల గరిష్ట పొడవు 15 అక్షరాలు పరిమితం చేసారు. ప్రయాణీకుడు సీనియర్ పౌరుడు అయి (60 సంవత్సరాల పైవయసున్న  మగ మరియు 58 సంవత్సరాల పై వయసున్న స్త్రీలు) సీనియర్ సిటిజన్ రాయితీని (మగ వారికి  బేస్ ఛార్జీలో 40% మరియు ఆడవారికి  బేస్ ఛార్జీలో 50%) పొందగోరితే వారు విధిగా దానికి సంబంధించిన బాక్స్ పై క్లిక్కు చేయాలి. సీనియర్ పౌరులు వారి ప్రయాణ సమయంలో ఏదైనా వారి వయస్సు అసలు రుజువును కలిగి ఉండాలని కోరుతారు. ఒక నమూనా ఫాంను పునరుత్పత్తి  కోసం క్రింద ఉంచారు. (మీరు కోరుకున్న బెర్త్ కేటాయింపు అప్పటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది).
 •  
 • టికెట్ వివరాలు, అనుకున్న సమయంలో టికెట్ల లభ్యత మరియు దాని ధర, తెరపై కనపడుతున్న సేవా ఛార్జిలు, మరియు చెల్లింపుల ఎంపికలతో పాటు సూచనలను అనుసరించండి.
 •  
 

 
   
 • "చెల్లింపు ఎంపిక"పై క్లిక్కు చేసి డ్రాప్ డౌన్ జాబితా నుంచి  చెల్లింపు రకం మరియు బ్యాంకును ఎంచుకోండి.
 •  
 • "చెల్లింపు చేయండి"ను క్లిక్కు చేస్తే అది  బ్యాంక్ సైటుకు మళ్ళిస్తుంది.
 •  
 

 
   
 • విజయవంతమైన చెల్లింపు మరియు వసతి బుకింగ్ తర్వాత, వినియోగదారుకు  "ప్రింట్ రిజర్వేషన్ స్లిప్" బటన్ తోపాటు టికెట్ నిర్ధారణ వివరాలు కనబడతాయి. దానిని క్లిక్కు చేస్తే  ERS ముద్రణ ఎంపికతో కనబడుతుంది.
 •  
 • వినియోగదారుడు తరువాత కూడా లెఫ్ట్ నావిగేషన్ బార్ 'బుక్ టిక్కెట్ల' లింక్ నుండి ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్ ముద్రించుకోవచ్చు.
 •  
 

 

ఇ-టికెట్ రద్దు – మార్గదర్శకాలు

 
   
 • వినియోగదారు ఇ-టికెట్ రద్దు చేసుకోవాలనుకుంటే  'నా లావాదేవీలు' వెళ్లి మెను బారులోని 'బుక్ టికెట్ హిస్టరీ' లింకుపై క్లిక్కు చేయాలి,   అక్కడ రద్దు చేయవలసిన టికెట్టును ఎంచుకొండి మరియు ' గో ఫర్ క్యాంసలేషన్' క్లిక్కు చేయండి. అక్కడ రద్దు ప్రయాణికుల ఎంపిక  ద్వారా రద్దును ఆరంభించవచ్చు.
 •  
 

 
   
 • కొందరు వినియోగదారుల టికెట్ మాత్రమే  రద్దు చేయాలనుకుంటే, రద్దు అవసరమైన వారిని మాత్రమే ఎంచుకోవాలి. పాక్షికం రద్దు జరిగినప్పుడు వారి ప్రయాణ సమయంలో  ERS కోసం కొత్త ప్రింటవుట్ తీసుకోవాలి.
 •  
 

 

టికెట్ పాక్షికంగా రద్దు అయిఉంటే, తాజాగా ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్ ప్రయాణికుడి దగ్గర ఉండవలిసిన అవసరం ఉంటుంది.

 

ట్రైన్ ఇ-టికెట్లు బుకింగ్  లాగిన్ పరిమితి

 
   
 • వినియోగదారు ఒక సెషన్ లో ఒక బుకింగ్ మాత్రమే ఉంటుంది  మరియు ఇంకో బుకింగు కోసం బలవంత లాగ్ ఔట్ ఐఆర్సిటిసి ఏజెంట్లతో సహా అందరు వినియోగదారులకు ఉంటుంది. కానీ వారెంట్ కింద రక్షణ బుకింగుకు  మినహాయింపు ఉంటుంది.
 •  
 • 0800 నుంచి 1200 గంటల వరకు  ఇ-టికెట్ బుకింగ్ సమయంలో ఈ పరిమితి ఉంటుంది. అయితే, ప్రయాణం/తిరుగు ప్రయాణ ఇ-టికెట్ బుకింగ్ సమయంలో ఈ పరిమితి వర్తించదు.
 •  
 

మూలం: IRCTC

 

తరచుగా అడిగే ప్రశ్నలు (ప్రశ్నలు)

 

Q1. ఐఆర్సిటిసిలో నమోదు ఎలా చేసుకోవాలి?

 

- దయచేసి  "నమోదు ప్రొసీజర్" విభాగంలో వివరించిన దశలను అనుసరించండి లేదా ఐఆర్సిటిసిలో నమోదు ఎలా చేయటం గురించిన స్టెప్ బై స్టెప్ గైడ్ పొందుటకు ఇక్కడ    

Q4. నేను ఇ-టికెట్ బుకింగు చెల్లింపు ఎలా  చేయవచ్చు?

 

- మీరు టికెట్ బుకింగు కోసం చెల్లింపు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నగదు కార్డు/వాలెట్లను ఉపయోగించవచ్చు.

 

Q5. చెల్లింపు లావాదేవీ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయ్యింది. చెల్లింపు జరుగింది కానీ ఏ టికెట్ బుకింగు కాలేదు. ఇప్పుడు ఏమి చెయ్యాలి?

 

- ఏ టికెట్ బుకింగు కాకపోతే, మీ చెల్లింపు కొద్ది రోజుల్లో మీ ఖాతాకు తిరిగి చేరుతుంది.

 

Q6. ఇ-టికెట్లు రద్దు చార్జీలు ఏమిటి?

 

- ప్రయాణీకుని ధ్రువీకరించిన (12.11.2015 w.e.f. రిజర్వు) టిక్కెట్ల రద్దు ఛార్జీ: -

 

(i) రైలు షెడ్యూల్ నిష్క్రమణకు 48 గంటల ముందు  కనీస రద్దు ఛార్జీలు  1వ ఏసీ/ఎగ్జిక్యూటివ్ క్లాస్: రూ. 240 2వ ఏసీ/1వ క్లాస్: రూ. 2003వ ఏసీ/ఏసీసి/3A ఎకనామి రూ. 180రెండవ తరగతి స్లీపర్ : రూ. 120 రెండవ తరగతి: రూ. 60

 

(ii). రైలు షెడ్యూల్ నిష్క్రమణకు కంటే 48 గంటల నుంచి 12 గంటల ముందు పై (i) ప్రకారం @ 25% కనీస చార్జీ.

 

(iii) రైలు షెడ్యూల్డ్ నిష్క్రమణ ముందు 4 గంటల నుంచి  12 గంటల మధ్య  (i) ప్రకారం @ 50% కనీస చార్జీ.

 

(iv) పైన సూచించిన కాలం తరువాత ఎలాంటి తిరిగి చేల్లింపులు ఉండవు.

 

మరింత తాజా వివరాల కోసం http://www.indianrail.gov.in/refund_Rules.html చూడండి.

 

Q7. నేను ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావటం మరచిపోతే?

 

- ఒక PNR లో ఒక E-టికెట్ బుక్ చేసుకున్న  ప్రయాణీకుడు రైలు ప్రయాణ సమయంలో తేలిపిన పది గుర్తింపు కార్డులు ఏదైనా ఉంచుకోవటం అవసరం. అది లేక పోతే  ప్రయాణీకులను  టికెట్టు  లేకుండా ప్రయాణిస్తన్నట్టుగా పరిగణిస్తారు మరియు అప్పటి రైల్వే నియమాల ప్రకారం నిర్ణయాలను తీరుకుంటారు.

 

Q8. ఇ-టికెట్ అనుకున్న దానికన్నా ప్రయాణాన్ని ముందుకు జరుపుట/ప్రయాణం వాయిదా వేయటం ఎలా?

 

- అసలు టికెట్ అన్ లైన్ ద్వారా రద్దు చేసుకొని తాజా టికెట్ తీసుకోవలసి ఉంటుంది.

 

Q9. ఇ-టికెట్ ప్రయాణీకుల పేరు మార్చడం ఎలా?

 

- ప్రయాణీకుల పేరును మార్చే ప్రక్రియను తెలుసు కోవడానికి http://contents.irctc.co.in/en/Eticket_new_cancel.htmlచూడండి .

 

Q10. పాక్షిక రద్దు ఇ-టికెట్ ద్వారా  చేయవచ్చా?

 

-  అవును. పాక్షిక రద్దు చేయవచ్చు. మీరు www.irctc.co.in లాగ్ ఆన్ చేసి "బుక్ టికెట్స్" లింక్ వెళ్లి రద్దు టికెటును ఎంచుకోండి మరియు రద్దు ప్రయాణికులను ఎంచుకోవడం ద్వారా రద్దును ప్రారంభించవచ్చు. పాక్షిక రద్దు ఉంటే చివరిగా మార్పుచేసిన టికెట్ (ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్) అసలు టికెట్టుగా ప్రింటు తీసుకోవాలి.

 

Q11. నేను జర్నీ బ్రేక్ టికెట్  ఇ-టికెట్ ద్వారా  బుక్ చేసుకోవచ్చా?

 

- ప్రస్తుతం ఈ సదుపాయం ఇంటర్నెట్ టిక్కెట్లకు అందుబాటులో లేదు

 

Q 12. నేను బోర్డింగ్ స్టేషన్ను మార్చవచ్చా?

 

- అవును  మీరు మార్చవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒక వ్రాత అభ్యర్థనను కనీసం 24 గంటల ముందు బోర్డింగ్ స్టేషన్ రిజర్వేషన్ల సూపర్వైజరుకు సమర్పించాలి లేదా  ఏదైనా కంప్యూటరైజ్డ్ రిజర్వేషను కేంద్రంలో రైలు కదలడానికి 24గంటల ముందు సంప్రదించాలి. అయితే, ఉపయోగించని ప్రయాణం భాగం కోసం ఏ తిరిగి చెల్లింపులు ఉండవు. ఇటువంటి మార్పులు ఒక్కసారి మాత్రమే చేసుకోవచ్చు.

 

Q13. నేను అసలు గమ్యాన్ని దాటి నా ప్రయాణం పొడిగించవచ్చా?

 

- అవును, భారతీయ రైల్వే ప్రయాణం పొడిగింపులను అనుమతిస్తుంది. మీ గమ్యం చేరే ముందు లేదా బుక్ చేసిన ప్రయాణం పూర్తయిన తర్వాత గాని టిక్కెట్  తనిఖీ సిబ్బంది కలవటం ద్వారా అనుమతి పొందాలి . ప్రయాణం పొడిగించిన భాగం కోసం ఛార్జీల టేలీస్కోపిక్ రేట్లు ప్రయోజనం లేకుండా సేకరించబడతాయి.

 

Q14. నా ధ్రువీకరించిన టికెట్ మరొకరిని బదిలీ చేయవచ్చా?

 

- మీకు ఒక ధ్రువీకరించిన టికెట్ ఉండి ప్రయాణం చేయలేక పోతే, మీ టికెట్ మీ కుటుంబ సభ్యులు తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త లేదా భార్యకు బదిలీ చేయవచ్చు. మీ టికెట్ బదిలీ అభ్యర్థనను రైలు షెడ్యూల్ నిష్క్రమణకు కనీసం 24 గంటల ముందు సమర్పించండి. టిక్కెట్లు కూడా బదిలీ చేయవచ్చు.

 
   
 • రైలు షెడ్యూల్ నిష్క్రమణకు కనీసం 24 గంటల ముందు విధి  నిర్వహణకు మరో ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ చేయవచ్చు.
 •  
 • గుర్తింపుపొందిన విద్యాసంస్థ  ప్రిన్సిపాల్/హెడ్ ద్వారా రైలు షెడ్యూల్ నిష్క్రమణకు కనీసం 48 గంటల ముందు ఇతర విద్యార్థులకు బదిలీ చేయవచ్చు.
 •  
 • వివాహ బృందంలోని ఇతర సభ్యులు, అటువంటి పార్టీ పెద్ద రైలు షెడ్యూల్ నిష్క్రమణకు కనీసం 48 గంటల  ముందు అభ్యర్థన చేసి బదిలీ చేసుకోవచ్చు.
 •  
 • ఎన్సిసి ఇతర సభ్యులు, సమూహం యొక్క అధికారి రైలు షెడ్యూల్ నిష్క్రమణకు కనీసం 24 గంటల  ముందు  అభ్యర్థన చేసినచో జరుగుతుంది. ఇటువంటి మార్పులు ఒక్కసారి మాత్రమే చేయవచ్చు. ఒకవేళ  అభ్యర్థన గ్రూపు సభ్యుల మొత్తం సంఖ్యలో 10% మించకపోతే.
 •  
 

Q15. భారతీయ రైల్వేలో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి ఎంత సామాను తీసుకు రావచ్చు?

 

-పూర్తి వివరాలు పొందడానికి ఈ లింకు పై క్లిక్కు చేయండి - http://www.indianrail.gov.in/luggage_Rule.html

 

Q16. నేను రైలు లో నా కుక్కను తీసుకు రావచ్చా?

 

- అవును. మీరు ఇక్కడ http://www.indianrail.gov.in/luggage_Rule.htmlవివరించిన విధంగా కొన్ని నియమాలు పాటించి వాటిని తీరుకు రావచ్చు.

 

మూలం: IRCTC , Indianrail.gov

 
                     
                                       
                             
       
     
                       
 
                                                     
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions