భారత ప్రభుత్వ కార్యక్రమాలు

                                                                                                                   
                                                                                                                                                                                                                                                                                 

                    భారత ప్రభుత్వ కార్యక్రమాలు                

                                                                                                                                                                                                                                                     

                   బ్యాంకులు విడివిడిగా కాని లేదా, సమీకృత వనరుల సహాయంతో కాని రుణాలకు, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సలహా కేంద్రాల ఏర్పాటును కీలకాంశంగా పరిగణనలోకి తీసుకోవాలని శ్రీ సి.పి. స్వర్ణకర్ అధ్యక్షతన రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుచేసిన కార్యాచరణ బృందం ( వర్కింగ్ గ్రూప్ ) , తన నివేదికలో సిఫారసు చేసింది.                

                                                                                             
                             
                                                       
           
 

భారత ప్రభుత్వ కార్యక్రమాలు

 

వ్యాపార ప్రతినిధి ( ఆర్ బి ఐ)

 

ఆర్ధిక అక్షరాస్యత, రుణ సలహా కేంద్రాలు

 

పరిచయం

 
   
 1. బ్యాంకులు విడివిడిగా కాని లేదా, సమీకృత వనరుల సహాయంతో కాని రుణాలకు, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సలహా కేంద్రాల ఏర్పాటును కీలకాంశంగా పరిగణనలోకి తీసుకోవాలని, వ్యవసాయ రుణాల పద్ధతులను, ప్రక్రియలను గురించి అధ్యయనం చేయడానికి శ్రీ సి.పి. స్వర్ణకర్ అధ్యక్షతన రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుచేసిన కార్యాచరణ బృందం ( వర్కింగ్ గ్రూప్ ) , తన నివేదికలో సిఫారసు చేసింది ( ఏప్రిల్ 2007 ). రైతులు తమ హక్కులను , బాధ్యతలను తెలుసుకోవడానికి ఈ విధమైన ఏర్పాటు ఎంతగానో తోడ్పడుతుంది. బ్యాంకు శాఖలు రైతులకు ఉపయోగపడే సమాచారాన్ని వీలైనంత ఎక్కువగా ప్రదర్శించగలగాలి. రైతులు బ్యాంకు శాఖలకు తాము చేయదలచుకున్న దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపుకునే సౌకర్యం సలహా కేంద్రాలలో కల్పించాలి.
 2.  
 3. ఇంతేకాకుండా, బాధిత రైతులకు సహాయం అందించడానికి అనుసరించవలసిన చర్యలను సూచించడంకోసం, శ్రీ ఎస్. ఎస్. జోషి అధ్యక్షతన రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుచేసిన మరొక కార్యాచరణ బృందం కూడా, రుణాల వసూళ్ళు మరింతగా సాధ్యపడాలంటే, రైతులకు ఆర్ధిక, జీవనోపాధుల సలహాలను అందించడం అవసరమని సూచించింది.
 4.  
 5. రిజర్వ్ బ్యాంక్ ఈ కార్యాచరణ బృందాల సిఫారసులను, 2007-08 వార్షిక విధాన ప్రకటనలోచేసిన ప్రతిపాదనను దృష్టిలో వుంచుకుని, ఎస్ ఎల్ బి సి కన్వీనర్ బ్యాంకులు వాటి పరిధిలోని రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతంలోని ఏదో ఒక జిల్లాలో, ప్రయోగాత్మకంగా, " ఆర్ధిక అక్షరాస్యత, రుణ సలహా కేంద్రం " ఏర్పాటుచేయవలసిందిగా సూచించింది.
 6.  
 7. ఆర్ధిక అక్షరాస్యత, సలహా కేంద్రాల ఏర్పాటుపై భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలను పేర్కొంటూ, ఒక వివరణాత్మక పత్రాన్ని రూపొందించి, ప్రతిస్పందనలకోసం రిజర్వ్ బ్యాంక్ వెబ్ సైట్‌లో వుంచడం జరుగుతుందని, 2007-08 వార్షిక విధాన మధ్యంతర సమీక్షలో ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగానే, ఈ వివరణాత్మక పత్రాన్ని రూపొందించారు. ప్రజలనుంచి అందే స్పందనల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ , ఈ వివరణాత్మక పత్రం విషయంలో తదుపరి చర్యలు తీసుకోగలుగుతుంది. ఈ పత్రంలో మూడు విభాగాలు వున్నాయి. పార్ట్ -ఏ అనే మొదటి విభాగం ఆర్ధిక అక్షరాస్యతకు , పార్ట్-బి అనే రెండవ విభాగం రుణ సలహాలకు సంబంధించినవి కాగా, పార్ట్-సి అనే మూడవ విభాగం ఆర్ధిక అక్షరాస్యత, రుణ సలహా కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రతిపాదిత పథకం తీరు తెన్నులను వివరిస్తుంది.
 8.  
 

పార్ట్-ఏ ఆర్ధిక అక్షరాస్యత

 
   
 1. ఆర్ధిక అక్షరాస్యత, లేదా ఆర్ధిక విద్య అంటే, ద్రవ్య సంబంధమైన మార్కెట్‌లో ఉపయోగించే ఉత్పాదనలను (ప్రొడక్ట్స్ ను) గురించిన పరిచయాన్ని లేదా అవగాహనను కలిగించడం అని స్థూలంగా నిర్వచించవచ్చు. ముఖ్యంగా, ఏ ఉత్పాదనను ఎంచుకుంటే, ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో, లేదా ఏ రకమైన నష్టాలు ఎదురుకావచ్చునో తెలుసుకుని, తగిన ఉత్పాదనలను ఎంపికచేసుకునే అవగాహననే ఆర్ధిక అక్షరాస్యతగా భావించవచ్చు. ఈ దృష్టితో చూస్తే, ఆర్ధిక అక్షరాస్యత అనేది, ప్రాథమికంగా, వ్యక్తులు తమ ఆర్ధిక వ్యవహారాలలో కష్టనష్టాల పాలుకాకుండా, వారి సంక్షేమాన్ని మెరుగుపరచడానికి దోహదంచేసే వ్యక్తిగత ఆర్ధిక నిర్వహణగా పేర్కొనవచ్చు.
 2.  
 3. అయితే, ఆర్ధిక అక్షరాస్యత ఆర్ధికపరమైన సమాచారాన్ని, సలహాలను అందించడం మాత్రమే కాదు, అంతకంటె మించినది. సాధారణంగా, పరిమితమైన వనరులను, పరిమితమైన నైపుణ్యాలను కలిగివుండే వ్యక్తి , ఆర్ధిక మధ్యవర్తులతో రోజువారీ సాగించవలసివచ్చే, సంక్లిష్టమైన ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి, ఆ వ్యక్తిని కేంద్రంగా చేసుకునిసాగే ఏ చర్చ అయినా, ఆర్ధిక అక్షరాస్యతే అవుతుంది.
 4.  
 5. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఒ ఇ సి డి) అనే సంస్థ ఆర్ధిక అక్షరాస్యతను ఈ క్రిందివిధంగా నిర్వచించింది. " ఆర్ధిక అక్షరాస్యత అంటే, ఆర్ధిక వినియోగదారులు / పెట్టుబడిదారులు ఆర్ధిక పరమైన ఉత్పాదనలను గురించి , తీరుతెన్నులను గురించి, కష్టనష్టాలను గురించి తమ అవగాహనను పెంపొందించుకుని ; సమాచారం ద్వారా, బోధన ద్వారా, సలహా ద్వారా ఆర్ధిక పరమైన నష్టాలను గురించి , అవకాశాలను గురించి మరింత అవగాహనతో వ్యవహరించగలిగే విధంగా తమ నైపుణ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని, ఏ ఉత్పాదనలను ఎంపిక చేసుకోవాలో, ఎక్కడ సహాయం పొందవచ్చునో తెలుసుకుని , తమ ఆర్ధిక సంక్షేమాన్ని మెరుగుపరచుకోవడానికి తగిన చర్యలను తీసుకోగలగడం "
 6.  
 7. ఈ విధంగా, ఆర్ధిక అక్షరాస్యత అంటే, " తన వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, వ్యాపార పరమైన సంక్షేమాన్ని, ఆర్ధిక భద్రతను పెంపొందించుకోవడంకోసం, ఆర్ధిక వనరులను గురించి తెలుసుకుని, పర్యవేక్షించి, ఆశించిన ఫలితాన్ని సాధించే విధంగా ఆ అవగాహనను వినియోగించే సామర్ధ్యం " అని అర్ధం.
 8.  
 
ఆర్ధిక అక్షరాస్యత ఆవశ్యకత
 
   
 1. ఆర్ధిక మార్కెట్లు రాను రాను మరింత సంక్లిష్టంగా తయారుకావడం; ఈ మార్కెట్లకు, సామాన్య మానవుడికి మధ్య సమాచార పరమైన సమతూకం లేకపోవడం కారణంగా, ఏ మార్గాన్ని అనుసరించాలో ఎంపికచేసుకోవడం సామాన్యుడికి మరింత క్లిష్టతరంగా మారుతున్నందువల్ల, ఇటీవలి సంవత్సరాలలో ఆర్ధిక అక్షరాస్యత ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
 2.  
 3. ఆర్ధిక చేకూర్పును ప్రోత్సహించి, అంతిమంగా ఆర్ధిక సుస్థిరత్వాన్ని సాధించడానికి ఉపయోగపడే ఒక ముఖ్య దోహదంగా, ఆర్ధిక అక్షరాస్యత పరిగణింపబడుతున్నది. అందువల్లనే, అటు అభివృద్ధి చెందిన దేశాలచెందుతున్న దేశాలు కూడా, ఆర్ధిక అక్షరాస్యతపైన / ఆర్ధిక విద్యా కార్యక్రమాలపైన దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. భారతదేశంలో, అక్షరాస్యత స్థాయి తక్కువగావుండడాన్ని, జనాభాలో అధిక శాతం మంది ఇప్పటికీ వ్యవస్థీకృత ఆర్ధిక సేవలకు దూరంగా వున్న పరిస్థితిని పరిగణిస్తే, ఈ దేశంలో ఆర్ధిక అక్షరాస్యత అవసరం మరింత ఎక్కువగా గోచరిస్తుంది. ఆర్ధిక చేకూర్పు నేపధ్యంలో చూసినప్పుడు , ఆర్ధిక అక్షరాస్యతకు మరింత ఎక్కువ ఆస్కారం వుంది. ఇప్పటివరకు వ్యవస్థీకృత ఆర్ధిక సేవలకు వెలుపల వున్నవారికి ఆర్ధిక సేవలను అందుబాటులోకి తేవడంలో ఒక ముఖ్యాంశం కావడంవల్ల, ఆర్ధిక అక్షరాస్యతకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.అయితే, ఆర్ధికవిద్యను నేర్పించడమంటే , ప్రవర్తనకు, మనస్తత్వానికి సంబంధించి మనస్సులలో గాఢంగా నాటుకు పోయిన అనేక రకాల భావజాలాలతో వ్యవహరించక తప్పదు. ఇది ప్రధానమైన అడ్డంకి కావచ్చు కూడా . సాంఘికంగా, ఆర్ధికంగా ఎంతో వైవిధ్యం కలిగిన ఇండియా లాంటి దేశంలో, వనరులు చాలా తక్కువగా వున్నవారికి, దారిద్ర్య రేఖ వెంబడి వున్న వారికి, ఎల్లప్పుడూ ఆర్ధికపరమైన ఒత్తిడులకు గురవుతున్న వారికి ఆర్ధిక అక్షరాస్యత మరింత అవసరం. వ్యవస్థీకృతమైన బ్యాంకు సేవలుపొందలేక, ఈ పేదవారు ఎంతో ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయాలవైపు మొగ్గవలసివస్తున్నది. ఇబ్బందికరమైన పరిస్థితులలో, ఆధారపడదగిన వనరులంటూ పెద్దగా లేకపోవడంతో , ఇంటి అవసరాలకు డబ్బు సర్దుబాటుచేసుకోవడమే ఒక పెద్ద సవాలు కాగా, ఆర్ధిక పరమైన నిర్ణయాలను తీసుకోవడానికి తగినంత అవగాహనకాని, నైపుణ్యంకాని లేకపోవడం పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నది. ఆర్ధిక అక్షరాస్యత వుంటే, వారు తమ జీవితావసరాలకు ముందుగానే సిద్ధంకాగలుగుతారు, ఊహించని ఉపద్రవాలు ఎదురైనా అనవసరంగా అప్పులపాలుకాకుండా, నిర్వహించుకు రాగలుగుతారు.
 4.  
 5. ” ఆర్ధిక విద్యకు, ఆర్ధిక అవగాహనకు సంబంధించిన మౌలిక విలువలను, ఉత్తమ ఆచరణ పద్ధతులను గురించి ” ఒ ఇ సి డి కొన్ని సిఫారసులు చేసింది. 3 క్లుప్తంగా, వాటి సారాంశాన్ని అనుబంధం-1 లో చూడవచ్చు. తగిన ఆర్ధిక విద్యా కార్యక్రమాలను రూపొందించుకోవడంలోను, అమలుజరపడంలోను ఇటు అభివృద్ధి చెందిన, అటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా సహాయకారిగా వుండాలన్నది ఈ సిఫారసుల ఉద్దేశం.
 6.  
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చొరవలు
 
   
 1. " ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ లిటరసి " (ఆర్ధిక అక్షరాస్యతా కార్యక్రమం ) పేరిట రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రాజెక్టును చేపట్టింది. పాఠశాలల, కళాశాలల విద్యార్థులు ; మహిళలు ; గ్రామీణ, పట్టణ పేదలు ; రక్షణ రంగానికి చెందిన సిబ్బంది; వృద్ధులు మొదలైన వివిధ వర్గాల వారికి రిజర్వ్ బ్యాంక్, ఇతర బ్యాంకుల విధి విధానాలను గురించిన సమాచారాన్ని అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. బ్యాంకులు, స్థానిక సంస్థల పాలనా యంత్రాంగం, ఎన్ జి ఓ లు, పాఠశాలలు , కళాశాలలు మొదలైన వాటి తోడ్పాటుతో; ప్రదర్శనలు, కరపత్రాలు, బ్రోచర్లు, డాక్యుమెంటరీ చిత్రాల రూపంలోను; రిజర్వ్ బ్యాంక్ వెబ్ సైట్ ద్వారాకూడా, లక్ష్యంగా పెట్టుకున్న ఈ వర్గాల వారికి అవగాహన కలిగిససామాన్యులకు అర్ధంకావడంకోసం, తన వెబ్ సైట్ ద్వారా హిందీ, ఇంగ్లీషులతో పాటు, 12 భారతీయ భాషలలో సమాచారాన్ని అందించే ఏర్పాటు రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే చేసింది.
 2.  
 3. 2007 నవంబర్ 14 వ తేదీనాడు, బాలల దినోత్సవం సందర్భంగా, ఆర్ధిక విద్య వెబ్ సైట్‌ను ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్‌సైట్ బ్యాంకులతో లావాదేవీల తీరుతెన్నులను, ఆర్ధిక వ్యవహారాలను, రిజర్వ్ బ్యాంక్ విధి విధానాలను గురించిన ప్రాథమికాంశాలను వివిధ వయస్సుల పిల్లలకు బోధించడానికి ఉద్దేశించినదే అయినప్పటికి, లక్ష్యంగా పెట్టుకున్న మహిళలు ; గ్రామీణ, పట్టణ పేదలు ; రక్షణ రంగం సిబ్బంది; వృద్ధులు మొదలైన వివిధ వర్గాల వారికికూడా ఉపయుక్తమైన సమాచారాన్ని ఈ వెబ్‌సైట్ అందిస్తుంది. బ్యాంకులతో లావాదేవీల తీరుతెన్నులు, ఆర్ధిక వ్యవహారాలు, రిజర్వ్ బ్యాంకి విధి విధానాలవంటి క్లిష్టమైన అంశాలను గురించి పిల్లలకు సులువుగా, ఆసక్తికరంగా వివరించడంకోసం కామిక్ బుక్స్ ( హాస్య పత్రికల ) పద్ధతిని అనుసరించారు. వివిధ విలువలకు చెందిన కరెన్సీ నోట్లలోని భద్రత ( సెక్యూరిటి ) పరమైన లక్షణాలను వివరించే డాక్యుమెంటరీ చిత్రాలు, వివిధ రకాల ఆటలుకూడా ఈ వెబ్ సైట్ లో వున్నాయి. భారతదేశంలోని వివిధ కరెన్సీ నోట్లను పాఠశాల విద్యార్థులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ వెబ్ సైట్ లో ప్రస్తుతం పొందుపరచిన ఆటలను ప్రత్యేకించి, రూపొందించారు. ఈ వెబ్ సైట్ ను త్వరలోనే హిందీలోను, 12 భారతీయ భాషలలో కూడా నిర్వహించనున్నారు.
 4.  
 5. ఇంతేకాకుండా, ఆర్ధిక అవగాహనను పెంపొందించడంలో భాగంగా, బ్యాంకులతో లావాదేవీలను గురించి, ఆర్ధిక చేకూర్పును గురించి, పాఠశాలల బాలలకు వ్యాస రచన పోటీలను రిజర్వ్ బ్యాంక్ నిర్వహించింది. ఆర్ధిక అక్షరాస్యతను వ్యాపింపజేయడంకోసం ఎగ్జిబిషన్స్‌లోకూడా రిజర్వ్ బ్యాంక్ పాల్గొంటున్నది. 1857 లో ప్రారంభమైన భారత స్వాతంత్ర్య పోరాటం 150 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా, 2007 లో ఏర్పాటుచేసిన " అజాదీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ " లో నిర్వహించిన ఎగ్జిబిషన్ లోకూడా రిజర్వ్ బ్యాంక్ పాల్గొన్నది. డిగ్రీలోపు చదువుతున్న విద్యార్థులలో, బ్యాంకింగ్ రంగాన్ని గురించి, రిజర్వ్ బ్యాంకునుగురించి ఆసక్తి, అవగాహన కలిగించడం కోసం, " ఆర్ బి ఐ యంగ్ స్కాలర్స్ అవార్డ్ " పేరిట ఒక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా ఒక పోటీ పరీక్షను నిర్వహించి, దాదాపు 150 మంది బాల మేధావులను ఎంపికచేసి, రిజర్వ్ బ్యాంక్ లో స్వల్ప కాలికమైన ప్రాజెక్టులలో పనిచేయడానికి వారికి స్కాలర్ షిప్స్ అందజేస్తారు.
 6.  
 

పార్ట్- బి క్రెడిట్ కౌన్సెలింగ్ (రుణాలగురించి సలహాలు)

 
   
 1. దివాలాకు వెళ్ళకుండా, అప్పులను తిరిగి చెల్లించే అవకాశాల గురించి రుణ గ్రహీతకు (అప్పు తీసుకునే వ్యక్తి కి) తెలియజేసి; అసలు అప్పంటే ఏమిటి, బడ్జెట్‌ను తయారుచేసుకోవడం ఎలా, ఆర్ధిక నిర్వహణ అంటే ఏమిటి అనే అంశాల గురించి, అవగాహన కలిగించడాన్ని క్రెడిట్ కౌన్సెలింగ్ అంటారు. 4 ఇది మూడు రకాలుగా ఉపయోగపడుతుంది. మొదటిది : ప్రస్తుత ఆర్ధిక సమస్యలనుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తుంది. రెండవది : తీసుకున్న అప్పును దుర్వినియోగం చేసినందువల్ల ఎదురయ్యే కష్టనష్టాలను గురించిన అవగాహన కలిగించి, ఆర్ధిక నిర్వహణ సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది. మూడవది ; ఆర్ధిక ఇబ్బందులలో వున్నవారిని, వ్యవస్థీకృత ఆర్ధిక సేవలను వినియోగించుకునేవిధంగా ప్రోత్సహిస్తుంది.
 2.  
 3. తిరిగి చెల్లించలేని అప్పుల ఊబిలో పడకుండా, అలాంటి అప్పులను ఎలా నివారించాలో అప్పు వినియోగదారులకు బోధించే ప్రక్రియను క్రెడిట్ కౌన్సెలింగ్ అంటారు (దీనినే బ్రిటన్ లో డెట్ కౌన్సెలింగ్ అంటారు) . ఈ ప్రక్రియలో , సాధారణంగా, రుణ గ్రహీతకోసం, అప్పు నిర్వహణ ప్రణాళికను ( డెట్ మేనేజ్‌మెంట్ ప్లాన్ .....డి పి ఎం ) రూపొందించవలసిందిగా, రుణదాతకు నచ్చజెబుతారు. అప్పు తీసుకున్న వ్యక్తి, అప్పు ఇచ్చిన వ్యక్తితో సంప్రదించి, తిరిగి చెల్లించడానికి అనువైన పథకాన్ని రూపొందించి, ఆ ప్రకారం చెల్లించడానికి డి పి ఎం తోడ్పడవచ్చు. అప్పులను గురించిన సలహాదారులు రూపొందించే డి పి ఎం లు, సాధారణంగా, తక్కువ వడ్డీలతో, తక్కువ సుంకాలతో, తక్కువ మొత్తాలలో చెల్లింపులు జరిపే పద్ధతులను వివరిస్తాయి. అప్పు నిర్వహణ ప్రణాళికలో పేర్కొనే చెల్లింపులు, వడ్డీ తగ్గింపులు అప్పు ఇచ్చినవారు నిర్దేశించే నిబంధనలకు అనుగుణంగానే వుంటాయి.
 4.  
 5. ఈ విధంగా, తమ సలహాకోసం వచ్చేవారిని, వారి సమస్యలకు వాస్తవిక పరిష్కారాలను కనుగొనేలా చేయడంలోను, సాధ్యంఅయ్యే చెల్లింపులకు అంగీకరింపజేయడంలోను రుణ సలహాదారులు తోడ్పడతారు. రుణ సలహాలను గోప్యంగా వుంచుతారు. ఈ సలహాలను సాధారణంగా , ఉచితంగానే అందిస్తారు. లేకుంటే, కేవలం నామమాత్రపు ఫీజు వసూలుచేస్తారు. అప్పటికే అప్పుల భారంతో బాధపడుతున్న వారిపై, ఈ సలహాల రూపంలో అదనపు భారం పడకుండా చూస్తారు.
 6.  
 
ప్రపంచ దృశ్యం
 

రుణ సలహాల ప్రక్రియ వివిధ దేశాలలో వివిధ రకాలుగా వుంది. రుణ సలహాలను గురించిన మొట్టమొదటి సంస్థ (ప్రసిద్ధిపొందిన) అమెరికాలో 1951 లో ఏర్పాటైంది. ఈ ప్రక్రియ త్వరలోనే అనేక ఇతర దేశాల దృష్టిని ఆకర్షించడంతో, గత కొన్ని సంవత్సరాలలో అనేక దేశాలు రుణ సలహాలపై ఎన్నో వినూత్న చర్యలను చేపట్టాయి. రుణ సలహాలపై అంతర్జాతీయ అనుభవాలను అనుబంధం-11 లో చూడవచ్చు.

 
ఇండియాలో రుణ సలహా ఆవశ్యకత
 
   
 1. ప్రపంచీకరణ, సాంకేతిక ప్రగతి, పెరిగిన మార్కెట్ దృక్పథం, ఆర్ధిక నవీకరణల నేపథ్యంలో, ఇటీవలికాలంలో ఆర్ధిక దృశ్యంలో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నది. ఇటీవలి సంవత్సరాలలో , వాణిజ్య బ్యాంకుల రంగంలో, చిన్నపాటి అప్పులు చెప్పుకోదగినంతగా పెరిగాయి. సాంప్రదాయికంగా, అవసరాన్నిబట్టి అప్పులు ఇవ్వడం అనే పద్ధతిని అనుసరిస్తూ వచ్చిన వాణిజ్య బ్యాంకులు, తమ దృష్టిని మరింత విస్తృతంగా వినియోగించే ఉత్పాదనల వైపు మళ్ళించడంతో, చిల్లర ( రిటైల్) రుణాలే ఈ బ్యాంకుల ప్రధాన వ్యాపారంగా మారింది. వినియోగదారులకు రుణాలు, గృహనిర్మాణ రుణాలు, క్రెడిట్ కార్డులకు అప్పులు, వ్యక్తిగత రుణాల మంజూరులో ఎంతో వేగవంతమైన పురోగతి కనిపిస్తున్నది. పట్టణాలలో, నగరాలలో గృహనిర్మాణ రుణాలు, వినియోగ రుణాలు, క్రెడిట్ కార్డులతో సహా వ్యక్తిగత రుణాలకు సంబంధించి 2001 లో మొత్తం 87.1 లక్షల ( 8.71 మిలియన్ల) ఖాతాలకు , 42,700 కోట్ల రూపాయల రుణ సహాయం అందగా, 2006 లో ఇవి 2.55 కోట్ల ( 25.5 మిలియన్ల) ఖాతాలు, 2,58,000 కోట్ల రూపాయల రుణానికి పెరిగాయి. ఆవృత వార్షిక వృద్ధి శాతాన్ని బట్టి( కాంపౌండ్ యాన్యువలైజ్డ్ గ్రోత్ రేట్...సి ఏ జి ఆర్ ) 2001-06 మధ్యకాలంలో , మొత్తం రుణ సహాయంలో పెరుగుదల 23.4 శాతం వుండగా, ఈ రంగాలకు రుణ సహాయంలో పెరుగుదల 43.3 శాతానికి చేరింది.
 2.  
 3. పట్టణ ప్రాంతాలలో, పెరుగుతున్న మధ్య తరగతి, మారుతున్న జీవన శైలి రేకెత్తించే ఆకాంక్షల కారణంగా, రాను రాను అనేకమంది తమ వినియోగ అవసరాలకే కాకుండా, ఆస్తులను ఏర్పాటుచేసుకోవడానికి కూడా అప్పు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో, వీరు తలకు మించిన అప్పులు చేయడం, పర్యవసానంగా చెల్లింపులు నిలిచిపోవడానికి కూడా దారితీస్తున్నది. వారి అదుపులో లేని పరిస్థితులు కూడా, అప్పు తిరిగి చెల్లించలేకపోవడానికి కారణం కావచ్చు. ఎక్కువ ఖర్చు చేయవలసి వచ్చే ఆర్ధిక అవసరాలు, ఉద్యోగం పోవడం, కఠినతరమైన వడ్డీ రేట్లు , మొదలైనవి కొన్ని సందర్భాలలో రుణ భారాన్ని అధికంచేసి, వారి ఆదాయ పరిధిలో అప్పు తిరిగి చెల్లించడం సులభ సాధ్యంకాని పరిస్థితిని కల్పిస్తాయి. తగిన ఆర్ధిక స్థోమత లేని వర్గాలకు వ్యక్తిగత రుణాలను, క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఇవ్వడంకూడా రుణభారం పెరగడానికి, అనుత్పాదకమైన ఆస్తులు ( ఎన్ పి ఏ లు ) పేరుకుపోవడానికి దారితీయవచ్చు.
 4.  
 5. గ్రామాలలో, ముఖ్యంగా, వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలో, రుతుపవనాలలో తీవ్రమైన హెచ్చు తగ్గులకు తోడు, ఆ విపత్తును ఎదుర్కోగలిగే విధానాల లేమి, వర్షాధార రైతాంగానికి ఎన్నో కష్ట నష్టాలకు కారణమవుతున్నది. 2001 లో కూడా, మనదేశంలో అక్షరాస్యత దిగువ స్థాయిలోనే, కేవలం 65.4 శాతంగా వున్నదని, ఇందులో కూడా పట్టణాలకు, పల్లెలకు మధ్య ఎంతో వ్యత్యాసం వున్నదన్న వాస్తవిక దృక్పథంతో ఈ అంశాన్ని పరిగణించవలసి వున్నది. 2001 గణాంకాల ప్రకారం, పట్టణ ప్రాంతాల అక్షరాస్యత 80.3 శాతం కాగా, గ్రామీణ అక్షరాస్యత కేవలం 59 శాతం మాత్రమే.
 6.  
 7. రుణ సహాయంలో భారీ పెరుగుదల, కుటుంబాల రుణభారాన్ని పెంచింది. రైతుల విషయంలో చూస్తే, ఎన్ ఎస్ ఎస్ ఓ నిర్వహించిన " పరిస్థితిని బేరీజువేసే సర్వే " ( సిచ్యుయేషన్ అసెస్‌మెంట్ సర్వే ....ఎస్ ఏ ఎస్) ప్రకారం, 2003లో మొత్తం రైతు కుటుంబాల సంఖ్య 8. 933 కోట్లు (89.33 మిలియన్లు) కాగా, వీటిలో 4.342కోట్ల (43.42 మిలియన్ల ....48.6 శాతం) కుటుంబాలు అప్పులపాలైనవే. సగటున, ఒక్కొక్క రైతు కుటుంబం చెల్లించవలసిన అప్పు 12,585 రూపాయలు. రాష్ట్రాల వారీగా చూస్తే, 2003లో, వ్యవసాయంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన, లేదా విభిన్న రకాల సాగును చేపట్టిన రాష్ట్రాలు ఎక్కువగా అప్పుల పాలైనట్టు తేలింది. 2003 లో, రైతాంగ కుటుంబాల మొత్తం అప్పు 1.12 లక్షల కోట్ల రూపాయలు కాగా, ఇందులో దాదాపు 65,000 కోట్ల రూపాయలు సంస్థాగతమైన రుణాలు, మిగతా దాదాపు 48,000 కోట్ల రూపాయలు సంస్థాగతం కాని ఏజెన్సీల నుంచి పొందిన అప్పులు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు 29,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వగా, వ్యాపారులు 6,000కోట్ల రూపాయల రుణం సమకూర్చారు. సంస్థాగతం కాని ఏజెన్సీలు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు ఇచ్చిన, దాదాపు, 18,000 కోట్ల రూపాయల అప్పులో అధిక భాగం, 30 శాతం కంటె ఎక్కువ వడ్డీకి ఇచ్చినదే. 8 జూన్ 2004 తరువాత, బ్యాంకులనుంచి వ్యవసాయ రుణాల మంజూరు గణనీయంగా పెరిగినప్పటికి, గ్రామ ప్రాంతాలలో ఇప్పటికీ సంస్థాగతం కాని అప్పుల పాత్ర చెప్పుకోదగినంతగా వుంది.
 8.  
 9. వ్యవసాయ రుణభారంపై శ్రీ ఆర్. రాధాకృష్ణ అధ్యక్షతన అధ్యయనం జరిపిన నిపుణుల బృందం, అప్పు బకాయిలు , ముఖ్యంగా రైతుల అప్పు బకాయిలు సక్రమంగా వసూలు కాని రకానికి ( డిస్ట్రెస్ ఫినామినా ) చెందినవన్న అభిప్రాయం ఎప్పటినుంచో వున్నట్టు, తన నివేదికలో పేర్కొన్నది. తీసుకున్న అప్పును ఉత్పాదక కార్యక్రమాలకు ఉపయోగించనప్పుడు అలా పేర్కొనడం సరైనదే అవుతుంది. అయితే, ప్రకృతి వైపరీత్యాలవల్లనో , తెగుళ్ళ వల్లనో, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందుల వంటివాటి వల్లనో, సరైన ఆలోచనలేని పెట్టుబడుల వల్లనో, లేదా ఊహించని ఇతర కారణాల వల్లనో పంట దెబ్బతినడం ; లేదా సాగుఖర్చు బాగా ఎక్కువై ఉత్పత్తి లాభసాటి కాకపోవడం, కాలదోషం పట్టిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండడం, లేదా పంట దిగుబడులకు తగిన గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల కూడా ఆ రైతు, తాను అప్పుగాతీసుకున్న మొత్తాన్ని , దానిపై వడ్డీని తిరిగి చెల్లించడం అసాధ్యంగా మారవచ్చు. మరీ ముఖ్యంగా, ఆ అప్పు ప్రైవేటు వడ్డీ వ్యాపారులవంటి సంస్థాగతం కాని ఏజెన్సీల నుంచి, అధిక వడ్డీకి తీసుకున్నదయితే, ఆ వడ్డీ మరింత మిక్కిలి భారమవుతుంది.
 10.  
 11. ఆర్ధిక వ్యవస్థ సుస్థిర ప్రగతితో సాగడానికి, ప్రజలను సంస్థాగతమైన ఆర్ధిక వ్యవస్థలోకి తేవడానికి అవసరమైన నియంత్రణ, పర్యవేక్షణ చర్యలను రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నది. అయితే, ఆర్ధిక వ్యవస్థ సుస్థిరంగా కొనసాగాలంటే, ఆర్ధిక వినియోగదారులకు తగినంత సంరక్షణ, విద్యావకాశాలు కూడా అవసరమవుతాయి. సంరక్షణ , విద్యావకాశాలు ఆర్ధిక వినియోగదారులకు సాధికారతను సమకూర్చి, తమ సంక్షేమానికి తామే బాధ్యత వహించే విధంగా వారిని మెరుగైన స్థితికి చేరుస్తాయి. ఈ నేపథ్యంలో, ఆర్ధిక అక్షరాస్యతకు, రుణ సలహాలకు ఎంతో ప్రాముఖ్యం లభిస్తున్నది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేని స్థితిలోవున్న రుణగ్రహీతలు, తమ బకాయిలనుంచి బయటపడగలిగే విధంగా, అనంతర చర్యలను రూపొందించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఈ సందర్భంలో, అనువైన, సమస్యకు అనుగుణమైన సలహాలతో రుణ గ్రహీతకు, సంబంధిత బ్యాంకుకు మధ్య తాత్కాలిక మధ్యవర్తిగా రుణ సలహాదారులు ఉపయోగపడుతారు. అప్పు చెల్లింపువల్ల, రుణగ్రహీతల ఆదాయాలు పడిపోని విధంగా అప్పు చెల్లింపు తీరుతెన్నులలో తగిన మార్పులు చేస్తూ, రుణ గ్రహీతలు రుణభారంనుంచి క్రమేణా బయటపడడానికి ఒక అర్ధవంతమైన పరిష్కారాన్ని సూచించడమే కాకుండా, ద్రవ్య నిర్వహణలో వారి నైపుణ్యాలను పెంపొందించడానికి కూడా రుణ సలహాలు దోహదం చేస్తాయి. ఇతర అనేక వస్తువుల కన్నా / సేవలకన్నా ఆర్ధిక ఉత్పాదనలు ఎంతో భిన్నమైనవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఆర్ధిక సేవలు అందించేవారికి, ఆర్ధిక వినియోగదారులకు మధ్య , సమాచారం అందుబాటులోను, బేరసారాలు సాగించగలిగే సత్తాలోను సమతుల్యత వుండదు.
 12.  
 13. చాలా సందర్భాలలో, ముఖ్యంగా ఎక్కువ ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యే వర్గాలలోనివారికి, తమ ఆర్ధిక పరిస్థితిని గురించి ఆకట్టుకునే రీతిలో వ్యక్తిగతంగా బ్యాంకులకు వివరించి, తగిన పరిష్కారాన్ని సాధించే నైపుణ్యం వుండకపోవచ్చు. అందువల్ల, బ్యాంకులు, తమ సొంత ప్రయోజనంకోసమే, తగిన ఆర్ధిక విద్యా బోధనతో, రుణ సలహాలతో వ్యక్తిగత రుణగ్రహీతలకు తోడ్పడవలసిన అవసరం వుంది.
 14.  
 15. బ్యాంకులు, డి ఎఫ్ ఐ లు ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించలేని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలను రుణ భారం నుంచి బయటపడవేయడానికి కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ ( సి డి ఆర్) రూపంలో అనువైన మార్గాలు ఇప్పటికే వున్నాయి. కొంచెం అటూ ఇటుగా , ఇలాంటి సౌలభ్యమే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు కూడా అందుబాటులో వున్నది. అయితే, వ్యక్తిగత రుణగ్రహీతలకు, బ్యాంకులకు మధ్య ఇలాంటి సంధాన సాధనమేదీ సిద్ధంగా అందుబాటులో లేదు. రుణ సలహా అనేది వ్యక్తిగత రుణగ్రహీతలకోసం ఉద్దేశించిందే కాని, సంస్థాగత రుణగ్రహీతలకోసం కాదు.
 16.  
 
రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యలు
 

ముందుగా చెప్పినట్టు, అప్పు వసూలు మరింతగా సాధ్యపడాలంటే, ముఖ్యంగా అంతగా అభివృద్ధి చెందని ప్రాంతాలలో అప్పులు సక్రమంగా వసూలు కావాలంటే, రుణ సలహాల, సాంకేతిక సలహాల అవసరం ఎంతైనా వున్నదని, శ్రీ సి. పి. స్వర్ణకర్, శ్రీ ఎస్. ఎస్. జోషి అధ్యక్షులుగా రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కార్యాచరణ బృందాలు నొక్కి చెప్పాయి. ఈ రెండు బృందాల సిఫారసులను, 2007-08 వార్షిక విధాన ప్రకటనను దృష్టిలో వుంచుకుని, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత పరిధిలోని ఏదైనా ఒక జిల్లాలో ఆర్ధిక అక్షరాస్యత, రుణ సలహా కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేయవలసిందిగా, ఆ రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతస్థాయి బ్యాంకుల సంఘాల లీడ్ బ్యాంకులకు, రిజర్వ్ బ్యాంక్ 2007 మే లో సూచించింది. ఆ కేంద్రాల నిర్వహణలో కలిగిన అనుభవాలనుబట్టి, ఇతరజిల్లాలలోకూడా ఈ రకమైన సలహా కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చునని రిజర్వ్ బ్యాంక్ లీడ్ బ్యాంకులకు సూచించింది.

 
కొన్ని బ్యాంకులు చూపిన చొరవ
 
   
 1. మన దేశంలో కొన్ని బ్యాంకులు, రుణ సలహా కేంద్రాల ఏర్పాటుకు, ఇప్పటికే చొరవచూపాయి. రుణ సలహా కేంద్రాల తీరుతెన్నులను అధ్యయనం చేయడంకోసం రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుచేసిన అంతర్గత బృందం మహారాష్ట్రలోని కొన్ని రుణ సలహా కేంద్రాలను సందర్శించింది. అవి: అభయ్ కౌన్సెలింగ్ సెంటర్ 8 ( బ్యాంక్ ఆఫ్ ఇండియా చే ఏర్పాటుచేయబదినది ), దిశ ట్రస్ట్ 9 ( ఐ సి ఐ సి ఐ బ్యాంక్ లిమిటెడ్ చే ఏర్పాటుచేయబడినది ), గ్రామీణ్ పరామర్శ కేంద్ర 10 ( బ్యాంక్ ఆఫ్ బరోడా చే ఏర్పాటుచేయబడినది ). అంతర్గత బృందం పరిశీలనలో వెల్లడైన అంశాల సారాంశాన్ని ఈకింద 29 పేరా నుంచి 33 పేరా వరకు పేర్కొనడం జరిగింది.
 2.  
 3. 29.ఈ కేంద్రాలలోని సలహాదారులు నేరుగా తమవద్దకు వచ్చినవారికి ముఖాముఖీ సలహాలను ఇవ్వడమే కాకుండా, టెలిఫోన్ ద్వారా, ఇ- మెయిల్ ద్వారా, ఉత్తరం ద్వారా తమను సంప్రదించేవారికి కూడా సలహాలు అందజేస్తున్నారు. అనేక క్రెడిట్ కార్డులు తీసుకోవడంవల్ల, వ్యక్తిగత రుణాల వల్ల, ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్న అప్పులవల్ల, సొసైటీలనుంచి తీసుకున్న అప్పులవల్ల సమస్యలను ఎదుర్కుంటున్నవారు తగిన సలహాకోసం, మార్గదర్శకత్వం కోసం ఈ సలహా కేంద్రాలకు వస్తున్నారు. ఇక్కడి సలహాదారులు వారికి తగిన విధంగా మార్గదర్శనంచేస్తూ, సంబంధిత బ్యాంకుతో సంప్రతించి వారి అప్పులను పునర్వ్యవస్థీకరించడంలో సహకరిస్తున్నారు.
 4.  
 5. ఈ కేంద్రాలలో కొన్ని సమాన లక్షణాలు                                            
    
  1. ఈ సలహా కేంద్రాలకు ఆ బ్యాం కులు ఏర్పాటుచేసిన ట్రస్టులు లేదా నేరుగా ఆ బ్యాంకులు నిధులు సమకూర్చుతున్నాయి
  2.  
  3. ఈ కేంద్రాలలోని సలహాదారులు ప్రస్తుతం పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన బ్యాంక్ ఉద్యోగులు
  4.  
  5. సలహాలను ఉచితంగా అందిస్తున్నారు
  6.  
  7. ప్రస్తుతం అనేక కేంద్రాలు ఇస్తున్న సలహాలు చాలావరకు, వ్యాధికి చికిత్స చేయడం లాంటివి. అంటే, ఏదో సంక్షోభం తలెత్తిన తర్వాత దానినుంచి బయటపడడానికి ఇచ్చే సలహాలు.
  8.  
 6.  
 7. కొన్ని సలహా కేంద్రాల ప్రత్యేక లక్షణాలు                                            
    
  1. ఆధునిక వ్యవసాయ పద్ధతులను గురించి, సహకార సేద్యాన్ని గురించి, మార్కెటింగ్ వ్యూహాలను గురించి రైతులకు తగిన సలహాలు ఇవ్వడంకోసం నిపుణులను నియోగించడం
  2.  
  3. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, గృహ నిర్మాణ రుణాలు, వ్యాపారం దెబ్బతినడంవల్ల అప్పులుచెల్లించలేకపోవడం వంటి పట్టణ వాసుల అప్పు సమస్యలపై దృష్టి కేంద్రీకరించడం
  4.  
  5. ఆ బ్యాంక్ అందజేసే వ్యవసాయ ఉత్పాదకాలను గురించి, సేవలను గురించి అవగాహన కల్పించడంకోసం బ్యాంకు కు చెందిన వ్యవసాయ విభాగ అధికారులను నియోగించడం
  6.  
 8.  
 9. కొన్ని సలహా కేంద్రాలు, శిక్షణ, అవగాహన శిబిరాలనుకూడా నిర్వహిస్తున్నాయి. పొదుపుచేయవలసిన అవసరాన్ని గురించి ప్రజలకు అవగాహన కలిగించడం, క్రెడిట్ కార్డులను గురించి, సుంకాలు స్వల్పంగావుండే ఉత్పాదనలు, మొదలైనవాటిని గురించి వారికి తెలియజేయడం ఈ శిబిరాల ఉద్దేశం. ఈ కేంద్రాలను చాలావరకు బ్యాంకుల ఆవరణలలోనే నిర్వహిస్తుండడంతో, వీటి నిర్వహణకు అయ్యే ప్రధాన వ్యయం, సలహాదారులకు చెల్లించే గౌరవ భృతి మాత్రమే. ఈ గౌరవ భృతి నెలకు 12,000 నుంచి 30,000 రూపాయలవరకు వుంటున్నది.
 10.  
 11. పొదుపు చేసుకోవలసిన ఆవశ్యకతను గురించి, ఖర్చుచేసే విషయంలో తగిన ప్రణాళికను రూపొందించుకోవడాన్ని గురించి, బ్యాంకులు అందించే వివిధ సదుపాయాలు మొదలైనవాటి గురించి ప్రజలకు శిక్షణ శిబిరాల ద్వారా అవగాహన కల్పించడంకోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికి, ఈ కృషి ప్రజల దృష్టికి వచ్చేలా చూడడానికి, మరింత విస్తృతంగా ఈ ప్రయత్నాన్ని చేపట్టడానికి ఇంకా ఎంతో చేయవలసి వుంది.
 12.  
 
రుణ సలహా కేంద్రాల ఏర్పాటులో ఎదురయ్యే సమస్యలు
 

ఇండియాలో రుణ సలహా కేంద్రాల ఏర్పాటులో ఈ కింది విధమైన సమస్యలు ఎదురవుతున్నాయి:

 
   
 • ప్రస్తుతానికి బ్యాంకులు సొంతంగా సలహా కేంద్రాలను ఏర్పాటుచేసి, వాటికి ట్రస్టుల రూపంలో తామే పూర్తిగా నిధులు సమకూర్చడం వల్లనే రుణ సలహా కార్యక్రమాలు జరుగుతున్నందువల్ల, , ప్రజలు, ఈ కేంద్రాలను ఆ బ్యాంకుల అప్పుల వసూలు విభాగాలుగా చూస్తారేమోనన్న సంశయం వుంది. స్వభావరీత్యా ఇలాంటి సలహా కేంద్రాలను నిర్వహించడానికి బ్యాంకులే ఎంతైనా తగినవన్న వాదన వినిపించగలిగినప్పటికి; బ్యాంకు వేరు, అది ఏర్పాటుచేసిన సలహా కేంద్రం వేరు అని స్పష్టంగా చెప్పగలిగే ఏర్పాటు ( ఫైర్ వాల్ ) అవసరం.
 •  
 • అప్పు తిరిగి చెల్లించలేని స్థితిలోవున్న రుణగ్రహీతలకు తగిన పరిష్కారాన్ని కనుగొనడంలో, ఈ సలహా కేంద్రాలు ఎదుర్కొంటున్న ప్రధానమైన అడ్డంకి ఏమిటంటే, అవి అందించే సలహాలకు బ్యాంకులలో అవసరమైన గుర్తింపు (లోకస్ స్టాండి ) లభించకపోవడం. అందువల్ల, సలహాకోసం తమవద్దకు వచ్చే వినియోగదారుల తరఫున, బ్యాంకులతో సంప్రదింపులు జరపడానికి, సమన్వయం కుదర్చడానికి వీలుగా ఈ సలహా కేంద్రాలకు సాధికారత కల్పించడం అవసరం.
 •  
 • సేవలో నాణ్యత ముఖ్యమైన అంశం కనుక, రుణ సలహాదారులకు, సలహా సంస్థలకు తగిన ప్రామాణికాలను నిర్ధారించడం మంచిది. అదేవిధంగా, సలహాదారులకు గుర్తింపును (అక్రెడిటేషన్) ఇచ్చే వ్యవస్థ కూడా వుండాలి. సలహా కేంద్రాల ఏర్పాటు వేగవంతమైతే, తాము ఒక సంఘంగా ఏర్పడే అంశాన్ని సలహాదారులు పరిశీలించవచ్చు. సలహా కేంద్రాలు విజయవంతం కావాలంటే, మంచి శిక్షణ కలిగి, అంకితభావంతో పనిచేసే సలహాదారులు అందుబాటులో వుండడం అవసరం. అందువల్ల, ఇలాంటి సలహాదారుల జాబితాను తప్పక రూపొందించుకోవాలి.
 •  
 • అప్పును గురించిన సమాచారం లేదా రుణ వివరాలు, అవసరమైనంతగా లేదా బొత్తిగా అందుబాటులో లేకపోవడం మరొక ప్రధానమైన అడ్డంకి. ఈ అడ్డంకిని తొలగించడం అవసరం.
 •  
 • అవగాహన కొరవడడమే , ఇలాంటి ప్రయత్నాలు ముందుకు సాగకుండా అడ్డుపడుతుంది కాబట్టి, రుణ సలహా ప్రక్రియను గురించి, ఈ సేవలను ఉచితంగానే పొందవచ్చునన్న అంశాన్ని గురించి విస్తృతంగా ప్రచారం కల్పించడం అవసరం.
 •  
 

పార్ట్ - సి ఆర్ధ

Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions