జాతీయ బాలల హక్కుల పరిరక్షణా కమీషను

                                                                                                                   
                                                                                                                                                                                                                                                                                 

                    జాతీయ బాలల హక్కుల పరిరక్షణా కమీషను                

                                                                                                                                                                                                                                                     

                   న్యాయ బద్దంగా బాలల హక్కుల పరిరక్షణకు సూచించిన ప్రమాణాలను పరీక్షించి రక్షణ షరతులను కల్పిస్తూ పటిష్టంగా అమలు పరచడంలో కేంద్ర ప్రభుత్వానికి రక్షణ షరతు పని విధమును నివేదిక రూపంలో ప్రదర్శించాలి.                

                                                                                             
                             
                                                       
           
 

చట్టబద్ధమైన ఉత్తర్వు

 

ఈ చట్టంలో పొందుపరచబడిన కార్యనిర్వాహక కార్యక్రమాలు క్రింది విధంగా ఉన్నాయి.

 
     
  • న్యాయ బద్దంగా బాలల హక్కుల పరిరక్షణకు సూచించిన ప్రమాణాలను పరీక్షించి రక్షణ షరతులను కల్పిస్తూ పటిష్టంగా అమలు పరచడంలో కేంద్ర ప్రభుత్వానికి రక్షణ షరతు పని విధమును నివేదిక రూపంలో ప్రదర్శించాలి.
  •  
  • బాలలు తమ హక్కులను అనుభవించే ప్రక్రియలో ఆటంక పరచే అన్ని కారణాలను పరీక్షించడంలో ఉగ్రవాదం, సాంఘిక హింస, హింసాత్మక చర్యలు, కలహాలు,  ప్రకృతి వైపరీత్యాలకు, గృహ హింస, హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌, పిల్లల అక్రమ రహణా,  అవమానకరంగా ప్రవర్తించడం, అనుచితంగా చూడడం, క్రూరంగా ప్రవర్తించడం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించడం వ్యభిచార గృహాలకు చేరవేయడం వంటి వాటికి తగిన పరిష్కార మార్గాలను సూచించడం.
  •  
  • ఆందోళనకు లోనైన, దుఃఖాన్ని కల్గివున్న,  నిర్లక్ష్యానికి గురైన, కుటుంబ ఆసరాలేని, చెరసాలలో ఖైదుననుభవించే వారి పిల్లలకు సరియైన పరిష్కార సూచనలు ఇవ్వడం.
  •  
  • రక్షణ షరతులతో బాటు సంఘంలో అవగాహనను పెంచే రీతిలో సమాజంలోని అనేక రకాల విభాగాల వారికి బాలల హక్కుల గురించి తెలియజేసే జ్ఞానాన్ని కల్పించడం.
  •  
  • బాల నేరస్తుల గృహాలు, పిల్లల కొరకు వసతి కల్పించిన వసతి గృహాలు, సంస్ధలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో, ఏ ఇతర అధికారిక సంస్ద ఆధ్వర్యంలోను, సామాజిక సేవా సంస్ధల పరంగాను పనిచేస్తున్న వాటిని తనిఖీ చేయడం. చికిత్స, సంస్కరణ మరియు రక్షణ  నిమిత్తం చేర్చిన పిల్లలను చూసే తీరును గమనించడం.
  •  
  • బాలల హక్కులను భంగం కల్గించె అంశాలను విచారణ చేసి, స్వయంగా తమంతట తాముగా ప్రకటించి, ప్రారంభక ఉత్తర్వులను ఇవ్వడంలోః
       
    1. బాలల హక్కులను భంగం పర్చడం మరియు నష్టపరచడం.
    2.  
    3. బాలల రక్షణ, అభివృద్ధికి సంబంధించిన చట్టాలను అమలు పరచక పోవడం .
    4.  
    5. పిల్లల సంక్షేమానికి ఉపశమింపచేయడానికి గల విధి విధానాల నిర్ణయాలను, మార్గదర్శక
    6.  
    7. సూత్రాలను సూచనలను పాటించక పోవడం లేదా,
    8.  
    9. ఈ విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేయడం.
    10.  
    11. బాలల హక్కులపై సూచనలు, సలహాలు, ఒప్పందాలను అధ్యయనం చేసి, అంతర్జాతీయ
    12.  
    13. విధానాల ద్వారా నిర్ణీత కాలవ్యవధులలో సమీక్షిస్తూ ప్రస్తుత వి ధానాలను, కార్యక్రమాలను ఇతర
    14.  
    15. కార్యకలాపాలను పటిష్టంగా అమలు పరచడంలో పిల్లలపై గల చక్కటి శ్రద్ధతో  సూచనలివ్వాలి.
    16.  
    17. బాలల హక్కుల దృష్ట్యా ప్రస్తుతమున్న చట్టాలను విశ్లేషించి పాటింపు ఎంతవరకు ఉందో విచారణ
    18.  
    19. చేసి, నివేదికలను పంపుతూ  విధానము, సాధన  పిల్లలపై ప్రభావితంగా జరుగుతుందో లేదో  చూసి
    20.  
    21. నూతన శాసనాలను ప్రతిపాదించడం.
    22.  
    23. పిల్లల అభిప్రాయల వెుర  తీవ్రంగా స్పందించి, ఆ రీతిలో ప్రభుత్వ శాఖలు, సంస్ధలు పని చేయడం.
    24.  
    25. బాలల హక్కుల సమాచారాన్ని తయారు చెసి ప్రచారం చేయడం .
    26.  
    27. పిల్లలు సమాచారాన్ని సంకలనం జేసి విశ్లేషణ చేయడం మరియు,
    28.  
    29. పిల్లల గురించి పనిచేసే వ్యక్తుల సమూహాలకు, ఉపాధ్యాయ శిక్షణలోను, పాఠశాల విద్యా
    30.  
    31. ప్రణాళికలోను,  పిల్లల హక్కుల విషయాన్ని చేర్చాలి.
    32.  
  •  
 

పరిష్కార ఏర్పాటు - ఒప్పందం

 

కేంద్ర ప్రభుత్వం ద్వారా మూడేళ్ళపాటు పనిచేసే విధంగా కార్యనిర్వాహక సంఘ సభ్యులు క్రింది విధంగా ఉంటారు.

 
     
  • పిల్లల సంక్షేమాభివృద్ధికి ప్రధానంగా పనిచేసిన ప్రసిద్ధమైన నిష్ణాతుడైన వ్యక్తి అధ్యక్షులుగా ఉంటారు.
  •  
  • బాలలకు న్యాయాన్ని  కల్పించడం, నిర్లక్ష్యానికి  గురైన బాలలు మరియు ప్రత్యేక బాలల యెడల
  •  
  • శ్రద్ధ, బాలకార్మిక వ్యవస్ధను  రూపుమాపే దిశలో పనిచేసిన, బాలల మనస్తత్వ శాస్త్రం, పిల్లల పరమైన
  •  
  • చట్టాల గురించిన అవగాహన, సమగ్రత, సమర్ధత,  అనుభవము, నిపుణత, నైతికత గల్గి, విద్య, శిశు
  •  
  • ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, అభివృద్ధి  శాఖల నుండి సమర్ధతగల ఆర్గురు సభ్యులు ఉంటారు.
  •  
  • సంయుక్త కార్యదర్శి హోదాకు తక్కువగాని వ్యక్తి కార్యదర్శిగా ఉంటారు.
  •  
 

అధికారాలు

 

పౌర న్యాయ స్ధానానికి గల అన్ని అధికారాలు ఈ కమీషన్‌కు ఉంటాయి. వాటితో పాటు ప్రత్యేకంగా క్రింది అంశాలకు సంబందించిన అధికారాలు ఉంటాయి.

 
     
  • భారత దేశంలో ఎక్కడున్న వ్యక్తికైనా సమన్లు పంపి, వారిని  రప్పించి , ప్రమాణం చేయించి పరీక్షించడం
  •  
  • కావలసిన దస్తావెజులు తెలుసుకోవడం, దాఖలు చేయడం.
  •  
  • ప్రమాణ ప్రకటన (అఫిడవిట్‌ )  ద్వారా  సాక్ష్యాన్ని స్వీకరించడం.
  •  
  • ఏ న్యాయస్దానం లేదా  కార్యాలయం నుంచైన ప్రభుత్వ రికార్టు లేదా నకలు పొందడం.
  •  
  • దస్తావెజు సాక్ష్య పత్రాలను పరిశీలించడంలో కమీషన్లు జారీచేయడం.
  •  
 

పిర్యాదు యంత్రాంగం

 

కమీషన్‌ యొక్క ఉత్తర్వు ద్వారా బాలల హక్కులకు భంగం చేసే అన్ని పిర్యాదులను విచారణ జరపడం. బాలల  హక్కులకు ఆటంకం కల్గించే తీవ్ర వ్యవహారంలో స్వయం ప్రేరిత ప్రకటన ద్వారా విచారణార్హత కల్గిన అంశంలో బాలలు వారి హక్కులను పొందలేకపోవడానికి గల కారణాలను పరిశీలించడం.

 
     
  • కమీషనుకు పిర్యాదును రాజ్యాంగంలో గల 8వ  షెడ్యూలు ప్రకారం ఏ భాషలోనైనా ఇవ్వవచ్చు.
  •  
  • ఇటువంటి పిర్యాదులపై ఎటువంటి  రుసుము వేయబడదు.
  •  
  • ఫిర్యాదుకి సంబంధించిన పూర్తి చిత్రణ అయ్యాక విషయాన్ని ప్రకటించవచ్చును.
  •  
  • ప్రమాణ ప్రకటన ద్వారా ఇంకను కావలసిన సమాచారాన్ని పొందవచ్చును.
  •  
 

పిర్యాదుచెసేముందుఇవితప్పనిసరిగాఉండేటట్లుచూడాలి.

 
     
  • పిర్యాదు సుస్పష్టంగా ఖచ్చితంగా ఉండాలి అనామకంగా, నకిలీ పేర్లలొ అస్పష్టంగా ఉండరాదు.
  •  
  • ఇటువంటి పిర్యాదులపై ఎటువంటి  రుసుము వేయబడదు.
  •  
  • ఆస్తి హక్కులు, ఒప్పందపు బాధ్యతలు వంటి పౌర సంబంధిత వివాదాలను పిర్యాదు చెయకూడదు.
  •  
  • ఉద్యోగ విషయాలను సంబంధించిన అంశాలు అయి ఉండకూడదు.
  •  
  • చట్టం పరంగా ఏర్పరచబడిన  ఏదేని కోర్టులో / ట్రిబ్యునల్‌ లో పూర్తి కాని (పెండింగ్‌ ) విషయమై ఉండరాదు.
  •  
  • కమీషన ద్వారా ఇంతకు ముందు నిర్ణయించబడని విషయం.
  •  
  • ఏ ఇతర కారణాలవల్లనైన కమిషన్‌  పరిధిలోనికి రానిది.
  •  
 

సంప్రదించవలసిన వివరాలు

                                                                               
 

పేరు

 
 

హోదా

 
 

ఫోన్‌నంబరు

 
 

ఇ-మెయిల్‌

 
 

శ్రీమతి. శాంతాసిన్హా

 
 

అధ్యక్షురాలు

 
 

23731583                              23731584

 
 

[email protected]

 
 

శ్రీమతి. సంధ్యా బజాజ్‌

 
 

సభ్యురాలు

 
 

23724021

 
 

[email protected]

 
 

శ్రీమతి. దీపాదీక్షిత్‌

 
 

సభ్యురాలు

 
 

23724022

 
 

[email protected]

 
 

శ్రీ. వి.సి. తివారి

 
 

కార్యదర్శి

 
 

23724020

 
 

[email protected]

 
 

ఇ పి బి ఎక్స్‌

 
 

 

 
 

23724027

 
 

 

 
 

రైల్వే పరిసరాలలో పిల్లల హక్కుల పరిరక్షణ

 

జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), రైల్వే ఫ్లాట్ ఫాంల పై నివసించే పిల్లల హక్కుల పరిరక్షణకై మార్గదర్శక సూత్రాలను రూపొందించటానికి వివిధ స్వచ్చంద సంస్థలతోనూ, పిల్లల హక్కులకై పోరాడే కార్యకర్తలతోను అనేకమార్లు  సమావేశాలు నిర్వహించడం జరిగింది. NCPCR సభ్యురాలైన సంధ్య బజాజ్ అధ్యక్షత వహించిన ఈసమావేశాలలో ఇటువంటి పిల్లలకు సంబంధించి; మత్తు పదార్థాల వాడకం, వీరిపై రైల్వే పోలీసుల భౌతికపరమైన అత్యాచారాలు, ఎటువంటి నీడ లేకపోవటం, నివాస సౌకర్యాల కొరత, గుర్తింపు లేకపోవటం, పునరావాసం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లేకపోవటం మరియు HIV / AIDS లాంటి జబ్బుల బారినపడటం వంటి వివిధ సమస్యలపై చర్చించటం జరిగింది.

 

గత సంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాలలో జరిగిన ఈ సమావేశాలలో 25 స్వచ్చంద సేవాసంస్థలు మరియుఫ్లాట్ ఫాంలపై ఉండే పిల్లలు కూడా పాల్గొనటం జరిగింది. ఈ సమావేశాలలో సాధి, అనుభవ్, ప్రాజెక్ట్ కన్.సర్న్ ఇంటర్నేషనల్ , ఢిల్లీ బ్రదర్ హుడ్ సొసైటి, చేతన, సలాం బాలక్ ట్రస్టు, యాక్షన్ ఎయిడ్, హ్యూమన్ రైట్స్-లా-నెట్ వర్క్, చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్, మరియు చైల్డ్ రైట్స్ ఫోరం మొదలగు స్వచ్చంధ సేవాసంస్థలు పాల్గొన్నాయి.

 

ఈ సమావేశాలలో దిగువ ఇచ్చిన విధంగా, వివిధ సూచనలు ప్రతిపాదింపబడ్డాయి. ఈ సూచనలను రైల్వే ఫ్లాట్ ఫామ్ పై నివసించే పిల్లల పరిరక్షణకై జరుపబోయే జాతీయ స్థాయి సమావేశంలో కూలంకషంగా చర్చించటం జరుగుతుందని బజాజ్ చెప్పారు. ఆ తరువాత తదనుగుణంగా రైల్వే అధికారులకు మార్గదర్శక సూత్రాలను జారీచేయటం జరుగుందని కూడా ఆవిడ తెలిపారు.

 

సూచనలు;

 
     
  • రైల్వే ఫ్లాట్ ఫామ్ ల వద్ద వైట్ ఫ్లూయిడ్ (తెల్లటి ద్రావకం) అమ్మకాన్ని నిషేదించటం. ఈ ద్రావకాన్ని పిల్లలు ఒక మత్తు పదార్ధంగా ఉపయోగించటం అనేది ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది.
  •  
  • రైల్వే ఫ్లాట్ ఫామ్ ల మీద పిల్లల హక్కులను పరిరక్షింటం అనేది రైల్వే అధికారులు తమ భాధ్యతగా అంగీకరించాలి.
  •  
  • భౌతికంగా, లైంగికంగా ఫ్లాట్ ఫామ్ ల పై అత్యాచారాలకు గురైన పిల్లలకోసం సత్వర వైద్యచికిత్సా  సౌకర్యాలు కలిగించాలి.
  •  
  • ఫ్లాట్ ఫామ్ ల పై నివసించే పిల్లలను వివిధ శ్రేణుల క్రింద విభజించాలి.
  •  
  • వృధాగా పడి ఉండే ప్లాస్టిక్ సామాన్లను ఏరివేసి, స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంలో
  •  
  • తోడ్పడుతున్న చెత్తను ఏరివేసే పిల్లల హక్కులను కూడా పరిరక్షించాలి.
  •  
  • ఫ్లాట్ ఫామ్ ల పై ఉండే పిల్లల కోసం పనిచేస్తున్న స్వచ్చంద సేవాసంస్థలకు రైల్వే పోలీసు దళాలు గుర్తింపు కార్డులను జారీచేయాలి.
  •  
  • దళాలు గుర్తింపు కార్డులను జారీచేయాలి.
  •  
  • ఈ పిల్లల హక్కులకి సంబంధించి, NCPCR రైల్వే పోలీసు దళాలకు తగిన ఆదేశాలు జారీచేయాలి.
  •  
  • రైల్వే ఫ్లాట్.ఫామ్ ల పై వదిలివేయబడిన, మరియు తప్పిపోయిన పిల్లలకు సంబంధించి కేంద్రీకృత ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేయాలి.ఈ విషయానికి సంబంధించిన సంపూర్ణ వివరాలతో NCPCR ఒక కేంద్రీకృత సమాచార నిధిని నిర్వహించాలి.
  •  
  • అనాధలయిన, తప్పిపోయిన, మరియు అత్యాచారాలకు గురైన పిల్లల సమస్యలను వేగవంతంగా తత్కాలంలో - 10 నిమిషాలలో పరిష్కరించే యంత్రాగాన్ని ఏర్పాటుచేయాలి.
  •  
  • ఈ పిల్లల భవిష్యత్తు విషయమై NCPCR  ముందు జాగ్రత్త చర్యలు తీసుకొనే విధంగా ఒక కట్టుదిట్టమయిన పర్యవేక్షణా వ్యస్థను ఏర్పాటు చేయాలి.
  •  
  • పునరావసం కల్పించబడిన పిల్లల కోసం నిర్మింపబడిన ఆవాసగృహాలు జైళ్ళలాగా ఉండకూడదు.
  •  
  • వాటిలో పరిశుభ్రత పాటించి పిల్లలను సరిగ్గా చూడాలి.
  •  
  • ప్రతి రైల్వేస్టేషన్ దగ్గరలో ఒక బాలల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
  •  
  • నిర్భంధ గృహాల పనితీరును పున: సమీక్షించాలి, సామాజిక తనిఖీలు నిర్వహించాలి.
  •  
  • పునరావాస కేంద్రాలు, రైల్వేఫ్లాట్ ఫామ్ ల పై తప్పిపోయిన, అనాధల మరియు అత్యాచారాలకు గురైన పిల్లల కోసం ఏర్పాటుచేసిన నిర్భంధ గృహాల సంక్షేమానికై పనిచేసే స్వచ్చంధ సేవాసంస్థల పనితీరును పర్యవేక్షించటానికి NCPCR నిర్ణీత సామాజిక తనిఖీ విధానాన్ని రూపొందించాలి.
  •  
 

బాలల హక్కుల చట్టం

 

హోదా - భావనలు

 

18 ఏళ్ళ లోపు వారందరూ బాలలె. పిల్లలను వృద్ధిలోకి తీసుకు రావడం , అభివృద్ధి పరచడం తల్లిదండ్రుల ప్రాధమిక బాధ్యత. బాలల హక్కులను గౌరవించి, అమలుపర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది.

 
     
  • నా హక్కుల గురించి తెలుసుకోవడం నాహక్కు ( ప్రకరణం - 42)
  •  
  • బాల్యం నా హక్కు.  నేను ఎవరిని నేను ఎక్కడ నివసి స్తున్నాను, నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు,  నేనే భాష మాట్లాడతాను,  నాది ఏ మతం,  నేను  అబ్బాయినా/అమ్మాయినా, నాది ఏ సంస్కృతి,  నేను అంగవైకల్యంతో  ఉన్నానా,  నేను ధనవంతమా, పేదా  అనే నిమిత్తం లేకుండా నన్ను సరిగ్గా చూడాలి.  ఈ విషయాలు  తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత(ప్రకరణం 2).
  •  
  • నా అభిప్రాయాలను  స్వేచ్చగా వ్యక్తపరచడానికి నాకు హక్కు గలదు.  దీనిని తీవ్రంగా పరిగణించాలి మరియు ఇతరులు చెప్పేది  వినడం ప్రతి ఒక్కరి బాధ్యత ( ప్రకరణం 12,13)
  •  
  • పొరపాట్లు చేయడం నా హక్కు, పొరపాట్ల నుండే  నేర్చుకుంటామని ప్రతి ఒక్కరు  అంగికరించి, బాధ్యత  వహించాల్సిందే  . (ప్రకరణం 28 )
  •  
  • నా సామర్ధ్యాలను పెంచుకుంటూ పోవడం నాహక్కు. ఇతరులకు గల వైయుక్తిక భేదాలను గౌరవించడం అందరి బాధ్యత (ప్రకరణం 23).
  •  
 

అభివృద్ధి

 
     
  • నాణ్యమైన చదువుకు పొందడం నా హక్కు.  పిల్లలందరిని బడికి వెళ్ళేటట్లు ప్రోత్సహించడం అందరి బాధ్యత (ప్రకరణం 23, 28 , 29 )
  •  
  • మంచి ఆంరోగ్యపరి రక్షణ పొందడం  నా హక్కు మరియు  రక్షిత మంచి నీటిని,  ప్రాథమిక
  •  
  • ఆరోగ్య పరిరక్షణను ఇతరులు పొందడానికి సహయపడడం ప్ర తి ఒక్కరి బాధ్యత (ప్రకరణం 24).
  •  
  • మంచి ఆహారాన్ని తీసుకోవడం నా హక్కు.  ప్రజలెవ్వరూ ఆకలి బాధకు గురికాకుండా చూడడం అందరి బాధ్యత (ప్రకరణం 24).
  •  
  • పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడం నా హక్కు. వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత (ప్రకరణం 29).
  •  
  • ఆడుకోవడం,  విశ్రాంతి తీసుకోవడం నా హక్కు (ప్రకరణం 31).
  •  
 

భధ్రత & రక్షణ

 
     
  • హాని, దుర్భాషలాడడం నుంచి రక్షణ పొందడం నా హక్కు.  ఇతరులను ప్రేమించడం, శ్రద్దను కల్గి  గౌరవించడం అందరి బాధ్యత (ప్రకరణం 19).
  •  
  • కుటుంబంతో క్షేమంగా , సౌకర్యంగా ఇంటి వాతావరణంలో ఉండడం నా హక్కు.  పిల్లలను
  •  
  • ఇంటిలో కుటుంబంతో కలసి మెలసి ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత (ప్రకరణం 9, 27 ).
  •  
  • నా వారసత్వం , సంస్కృతి, నమ్మకాలకు  గర్వించడం  నా హక్కు . ఇతరుల నమ్మకాలను, సంస్కృతిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత (ప్రకరణం 29, 30 ).
  •  
  • హింసాత్మక చర్యలు, దండన (మాట ద్వారా, శారీరకంగా మానసికంగా)  లేకుండా బతకడం
  •  
  • నా హక్కు. ఇతరులను దండించకుండా,  హింసించకుండా  ఉండడం  ప్రతి ఒక్కరి బాధ్యత (ప్రకరణం  2, 28, 37, 39) .
  •  
  • ఆర్థిక దోపిడి , లైంగిక వేధింపుల నుండి రక్షణ పొందడం నా హక్కు . బలవంతంగా  పిల్లలను పనిలో  చేర్చరాదు మరియు భద్రతా వాతావరణంలో స్వేచ్చగా ఉండేటట్లు చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత (ప్రకరణం 32, 34).
  •  
  • ఏరకమైన దోపిడికి గురికాకుండా రక్షణ పొందడం నా హక్కు.  ఏ ఇతర విధానాల ద్వౌరా కూడా దోపిడికి గురి కాకుండా చూడడం  ప్రతి ఒక్కరి బాధ్యత (ప్రకర ణం 36).
  •  
 

పిల్లలకు సంబంధించిన అన్నింటిలో పిల్లల ఇష్టాలను పరిశీలనలోకి తీసుకొనే ప్రాథమిక ప్రతిపాదన 1989వ సంలో బాలల హక్కుల గురించి జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో బాలల హక్కులకు ప్రముఖస్థానమివ్వబడింది. దీనిలో ప్రపంచవ్యాప్తంగాగల అన్నిబాలలహక్కులు ఉన్నాయి. ఈ ప్రతిపాదనపై 1992వ సంలో భారతప్రభుత్వం సంతకం చేసింది.

 

బాలల హక్కుల ప్రధాన సంరక్షకులుగా పంచాయతీలు

 

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం , చిన్నసోలిపేట గ్రామ సర్పంచ్‌గా శ్రీ నరసింగరావు బాధ్యత చేపట్టినపుడు, ముందుగా ఆయన గమనించిన విషయం ఏమిటంటే, పాఠశాలలను కల్యాణ మంటపాలుగానో, ఏవైనా వేడుకలు జరపడానికో,ఇతర అనేక రకాల కార్యక్రమాలకో ఉపయోగిస్తున్నారుకాని, చదువుకు సంబంధించి మాత్రం అవి బొత్తిగా ఉపయోగపడడంలేదని.

 

నర్సింగరావు చేసిన మొదటి పని, ఆ పాఠశాలలను శుభ్రం చేయించి, మంచినీరు, పారిశుద్ధ్య సౌకర్యం కల్పించి, పాఠశాలలను పిల్లలచదువుకోసం తప్ప మరే పనికి ఉపయోగించకుండా కట్టుదిట్టం చేయడం. తర్వాత, గ్రామ యువత, పంచాయతీ ప్రతినిధులతో గ్రామ విద్యా సంఘాన్ని ఏర్పాటు చేసి, ప్రతి నెల ఆ విద్యా సంఘం సమావేశమై తమ ప్రాంతంలోని పిల్లల చదువు తీరుతెన్నులపై శ్రద్ధవహించే చర్యలు తీసుకున్నారు.

 

" పంచాయతీరాజ్ సంస్థలు.( పి ఆర్ ఐ లు)..బాలల హక్కులు " అనే అంశంపై , బాలల హక్కుల పరిరక్షణ జాతీయ సంస్థ (ఎన్ సి పి సి ఆర్), పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో, ఇలా కొన్ని పంచాయతీలు చేపట్టిన ఉత్తమమైన పద్ధతులను గురించి ఒకరితో ఒకరు పంచుకోవడం జరిగింది. నేడు పిల్లలకు ఎదురవుతున్న అసంఖ్యాకమైన సమస్యల దృష్ట్యా, బాలల హక్కులను పర్యవేక్షించడం, కాపాడడంలో పంచాయతీల పాత్ర ప్రాముఖ్యాన్ని ఈ సదస్సు ప్రధానంశంగా చేపట్టింది.

 

పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీ రాజ్‌వంత్ సంధు, బాలలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతగురించి పేర్కొంటూ, భారతదేశంలోని గ్రామాలలో 30 కోట్లమంది పిల్లలు వున్నారని, అయితే అక్కడ వారికి ఆరోగ్య, విద్యా సౌకర్యాల కొరత దారుణంగా వున్నదని, నాణ్యమైన విద్యనేర్చుకోగలిగే అవకాశాలుకూడా పలువురికి లేవని, రోజుకు రెండుపూటలా తిండికూడా వారికి కరువేనని ఆవేదన వ్యక్తంచేశారు.

 

ఇటీవల విడుదలచేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయన నివేదిక ప్రకారం, భారత దేశంలో 47 % పిల్లలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారనికూడా ఆమె పేర్కొన్నారు.

 

అయితే, పంచాయతీరాజ్ సంస్థలు బాలల హక్కుల పరిరక్షణకు నడుంబిగించిన ప్రతిచోట, విద్య, ఆరోగ్యం, బాలల అక్రమరవాణా నిరోధం వంటి అభివృద్ధి సూచికలు ఒక్కసారిగా మెరుగుపడిన వాస్తవాన్ని ఈ సదస్సు వెలుగులోకి తెచ్చింది. ఈ వాస్తవానికి గుర్తింపుగానా అన్నట్టు, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ మణిశంకర్ అయ్యర్ , ఈ సదస్సులో చేసిన ప్రారంభోపన్యాసంలో, బాలల హక్కుల విషయంలో నిర్మాణాత్మకంగా ప్రతిస్పందించే విధంగా, ప్రభుత్వం పంచాయతీలకు సాధికారత కల్పించడం అవసరమని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ సంస్థలు, ఎన్నికైన ప్రజా ప్రాతినిధ్య సంస్థలు, బాలల హక్కులను సంస్థాపరంగా చేపట్టడానికి వీలుగా, తగిన కార్యక్రమాలను, నిధులను, నిర్వాహక సిబ్బందిని పంచాయతీలకు తప్పనిసరిగా, అందుబాటులో వుంచాలనికూడా ఆయన ప్రతిపాదించారు.

 

బాలల హక్కులను స్థానిక పాలనలో భాగంగా చేయడంలో, ఎన్ సి పి సి ఆర్ సాధించిన ప్రగతిని, కమిషన్ కార్యక్రమాల తీరుతెన్నులపై ఇటీవల జరిగిన ఒక సమావేశంలో, ప్రధాన మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ అభినందించారు. ఎన్ సి పి సి ఆర్ కార్యక్రమాలకు తన తోడ్పాటును ప్రధానమంత్రి ప్రకటించారు.

 

బాలల హక్కుల పరిరక్షక పాత్ర విషయంలో, పంచాయతీ ఏ మేరకు ప్రభావం చూపగలదనేదానికి ప్రతీకగా, షాబాద్ మండల గ్రామ పంచాయతీ, ఆరోగ్య సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ సంఘం, అంగన్‌వాడీలను, బాలలలో పోషకాహార స్థాయిని , ఏ ఎన్ ఎం ల పనితీరును, టీకాల నిర్వహణను, అదనపు విటమిన్ మాత్రల పంపిణీని, ఇతర సంబంధిత అంశాలను పర్యవేక్షిస్తుంది.

 

తమ పంచాయతీ, బాలల హక్కులను ఒక ప్రధానాంశంగా చేపట్టినందువల్ల, షాబాద్ మండలంలో బాలలు కార్మికులుగా మారుతున్న సంఘటన ప్రస్తుతం, ఒక్కటికూడాలేదని, శ్రీ రావు సగర్వంగా ప్రకటించారు.

 

మేఘాలయలో, పిల్లలు ఇళ్ళనుంచి తప్పిపోయిన సంఘటనలు 132 వున్నాయని, అయితే, పోలీసులకు కాని, కోర్టులకు కాని ఈ విషయం తెలియదని, అక్కడి పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే, ఈ తప్పిపోవడాలనుగురించి, ఇప్పుడు, ఐక్యరాజ్య సమితి, మాదక ద్రవ్యాలు, నేర వ్యవహారాల, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పరిశోధిస్తున్నది.

 

బాలల హక్కుల విషయంలో చక్కని కృషి చేసినవిగా ఎన్ సి పి సి ఆర్ ప్రముఖంగా ప్రస్తావించిన, 600 గ్రామ పంచాయతీల ప్రతినిధులకు, రావు ఒక ప్రతీకగా పేర్కొనదగిన సభ్యుడు. బాలల హక్కుల గురించిన అవగాహన కలిగి, వారి సమస్యలపై స్పందించడానికి , బాలల హక్కులకు సంబంధించిన ప్రభుత్వ సంస్థల పనిని పర్యవేక్షించడానికి, తగిన వ్యవస్థను రూపొందింఛుకున్న ఈ 600 గ్రామ పంచాయతీలు, దేశంలోని ఇతర ప్రజా ప్రతినిధులకు ఈ విషయాలలో శిక్షణ ఇవ్వగలిగే వనరుల కేంద్రాలుగా పనిచేయగల శక్తిసామర్ధ్యాలను కలిగివున్నాయనికూడా, ఎన్ సి పి సి ఆర్ చైర్‌పర్సన్ పేర్కొనడం విశేషం.

 

బాలల హక్కులకు సంబంధించిన వివిధ అంశాలను సంస్థాపరంగా చేపట్టడంలో పి ఆర్ ఐ లకు సహకరించడానికి, కొన్ని ప్రభుత్వేతర సంస్థలు కృషిచేస్తున్నాయి. ఉదాహరణకు, బెంగుళూరుకు చెందిన బాలల హక్కుల సంస్థ (చైల్డ్ రైట్స్ ట్రస్ట్) , గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్ శాఖ తోడ్పాటుతో ప్రత్యేక గ్రామ సభలను నిర్వహిస్తున్నది. " పిల్లలలో పోషకాహార లోపం, బాలలకు సంబంధించిన ఇతర అన్ని అంశాలతో సహా, గ్రామ పంచాయతీ చక్కగా వుండడానికి పూర్తి బాధ్యత పి ఆర్ ఐ లదేనని కర్ణాటక పంచాయతీల చట్టం నిర్దిష్టంగా పేర్కొంటున్నది. అంటే, బాలల సంక్షేమానికి బాధ్యత స్థానిక స్వపరిపాలన సంస్థలదేనని స్పష్టం చేయడమే కదా '' అని ఈ ట్రస్ట్‌కు చెందిన శ్రీ వాసుదేవ శర్మ వివరించారు.

 

పూనేకు చెందిన ఎస్ ఇ డి టి 350 పంచాయతీలలో పనిచేస్తున్నది. " గ్రామ పంచాయతీలు ఇప్పటికే , చట్టపరంగా నిర్వహించవలసిన పాత్రను నిర్దిష్టంగా పేర్కొంటూ, కొన్ని గ్రామ సంఘాలను ఏర్పాటుచేశాయి. అందువల్ల , బాలల హక్కుల కార్యక్రమాలను ఈ సంఘాల ద్వారా ప్రవేశపెట్టడం మాకు సులువైంది '' అని ఎస్ ఇ డి టి కి చెందిన సూర్యకాంత్ కులకర్ణి పేర్కొన్నారు.

 

ఎన్నికైన ప్రజాప్రతినిధులకు బాలల హక్కులపై శిక్షణ సాధారణంగా, స్థానిక బాలలకు సంబంధించి, జననాల నమోదు, వివాహ సమయంలో వారి తలిదండ్రుల వయస్సులు, బడికివెళ్ళే పిల్లల సంఖ్య, బడిమానివేసిన పిల్లల సంఖ్య, టీకాలు, ఇతర ఆరోగ్య వివరాల వంటి గణాంకాలను సేకరించి, విశ్లేషించవలసిన ప్రాముఖ్యాన్ని గుర్తించే విధంగా వారికి తగిన అవగాహనను పెంపొందించడంతో మొదలవుతుంది. పిల్లలు పాఠశాలలు సరిగా హాజరవుతున్నది లేనిది , పాఠశాలలలో ప్రాథమిక సౌకర్యాల అవసరం ఎప్పటికఫ్ఫుడు ఎలా పెరుగుతున్నది గమనిస్తుండడం, ఎన్ ఆర్ ఇ జి ఎ వంటి శ్రమతో కూడిన పనులకు సంబంధించిన పథకాలలో పిల్లలను నియోగించకుండా జాగ్రత్తపడడం , మధ్యాహ్న భోజనం వంటి పథకాలు, అంగన్‌వాడీలు పిల్లల ఆహార అవసరాలను తీర్చేవిధంగా శ్రద్ధ వహించడం వంటి విషయాలలో గ్రామ పంచాయతీలు ఎంతో ప్రముఖ పాత్ర పోషించవచ్చు.

 

" నేను సర్పంచ్‌గా పదవీ స్వీకారం చేసిన సమయంలో, పిల్లలను సంరక్షిస్తానని ప్రమాణం చేశాను. మా ఊరి బాలల సంక్షేమంపైననే , మా ఊరి భవిష్యత్తు ఆధారపడి వుంది '' , అని మధ్యప్రదేశ్ లోని తికంఘర్ బ్లాక్, హీరానగర్ గ్రామ సర్పంచ్ మింత్రం యాదవ్ , ఈ సదస్సులో పేర్కొన్నట్టు, గ్రామీణ భారత దేశంలోని 30 కోట్లమంది పిల్లలకు వారి పంచాయతీలనుంచి లభించే సంరక్షణే వారి జీవితాలను మెరుగుపరిచే ఒక మహదవకాశం కావచ్చు.

 

పునరావాస పథకాలలో బాలల హక్కులకు స్థానం

 

ప్రాజెక్టులవల్ల ఉనికి కోల్పోయిన కుటుంబాలకు పునరావాసం కల్పించి, ఆ కుటుంబాలు తిరిగి స్థిరపడేలా దోహదం చేయడానికి ఉద్దేశించిన జాతీయ విధాన పత్రం-2003, జాతీయ పునరావాస విధాన పత్రం-2006 లలో , బాలల అవసరాలు, వారి హక్కులు చోటు చేసుకునేలా ఎన్ సి పి సి ఆర్ కొన్ని మార్పులను సూచించింది.

 

అభివృద్ధి కార్యక్రమాల కారణంగానో, విపత్తులు, సంఘర్షణల కారణంగానో ప్రజలను ఆ ప్రదేశాలనుంచి తరలించిన సందర్భాలలో, పిల్లల పరిస్థితి ఎలా వుందన్న విషయాన్ని సమీక్షిస్తే, అంత భారీ స్థాయిలో పిల్లల సౌకర్యాలకు ఏర్పడే కొరతను పునరావాస కార్యక్రమాలు చాలావరకు పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కనిపించడంలేదని, ఎన్ సి పి సి ఆర్ అధ్యక్షురాలు శ్రీమతి శాంతా సిన్హా , కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రఘువంశ్ ప్రసాద్ గారికి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.

 

చాలా సందర్భాలలో ఆహార , వైద్య సౌకర్యాలు అందుబాటులో లేక పిల్లలు ఆకలితో కడుపు మాడ్చుకోవలసి రావడం, పోషకాహార లోపంతో బాధపడడం జరుగుతున్నాయని ఆమె ఆ లేఖలో వివరించారు. అదే, బడికి వెళ్ళే పిల్లలయితే, వారిని బడులకు దూరం చేస్తున్నారు గాని, కొత్త ప్రదేశంలో వారిని తిరిగి పాఠశాలలలో చేర్పించడానికి, ఎలాంటి ఏర్పాటు చేయడంలేదని ఆమె పేర్కొన్నారు.

 

తిరిగి బడులలో చేరాలంటే-ముఖ్యంగా, వారి కుటుంబాలు పొరుగు రాష్ట్రాలలో పునరావాసం పొందినపుడు- వారికి సాధికారికమైన గుర్తింపు లేకపోవడం, అడ్మిషన్ తతంగాలు, అంతకు ముందు చదివిన పాఠశాలవారు ఇచ్చిన బదిలీ సర్టిఫికెట్‌ను ఒప్పుకోకపోవడం వంటి అనేక సమస్యలను ఈ పిల్లలు ఎదుర్కోవలసి వస్తున్నదని ఆమె ఆ లేఖలో ఏకరువు పెట్టారు.ఎందరో పిల్లలు, తమకు అయినవారందరిని కోల్పోయి ఎలాంటి ఆదరణకు, సంరక్షణకు నోచుకోవడం లేదని ఆమె వాపోయారు. పునరావాస వ్యవహారాలను బాలల కోణంనుంచి పరిశీలించవలసిన ఆవశ్యకతగురించి, పునరావాస వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఒక నివేదిక ద్వారా వివరించాలనికూడా కమిషన్ యోచిస్తున్నది. '' కుటుంబాల తరలింపువల్ల, పిల్లలకు పోషకాహారం, విద్య, ఆరోగ్యం, ఇతర సౌకర్యాల అందుబాటుకు విఘాతం కలుగుతుంది. అందువల్ల కుటుంబాల తరలింపు బాలల హక్కుల ఉల్లంఘనకు కూడా దారితీస్తుంది' అనే వాస్తవాన్ని, పునరావాస కల్పన జాతీయ విధాన పత్రం ఉపక్రమణిక ( ప్రి యాంబుల్)లో నిర్దిష్టంగా పేర్కొనాలనికూడా కమిషన్ కోరుతున్నది. కుటుంబాల తరలింపు అనేది పిల్లలకు సంబంధించిన అన్ని రకాల హక్కులపైన,అవకాశాలపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నదో మదింపు జరపాలని ; ఈ మదింపు వయస్సునుబట్టి, లైంగికతను(జండర్)బట్టి కూడా నిర్దిష్టంగా వుండాలనికూడా కమిషన్ ఆశిస్తున్నది.

 

పునరావాస కుటుంబాల బాలలలోకూడా, ఎస్ సి / ఎస్ టి కుటుంబాల పిల్లలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, వారికి ఎలాంటి అంతరాయం లేకుండా చదువుకొనసాగే వీలును విధానపత్రంలో పొందుపరచాలని కమిషన్ కోరుతున్నది. ఈ పిల్లలకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ళు, ఐ సి డి ఎస్ లలో విధిగా చోటు కల్పించాలని, అదే విధంగా స్కాలర్ షిప్పులు, ఇతర అన్ని రకాల సౌకర్యాలను, హక్కులను వీరికి తప్పనిసరిగా వర్తింపజేయాలని కమిషన్ ప్రతిపాదిస్తున్నది. కుటుంబ ఆస్తులను అనుభవించే విషయంలో , కొడుకులతో సమానంగా వివాహంకాని కూతుళ్ళకుకూడా సర్వహక్కులు వుండాలని ; వీరికోసం పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాలు, హాస్టళ్ళ నిర్మాణానికి తగినంత భూమిని సేకరించాలని కమిషన్ సిఫారసుచేస్తున్నది. ఈ వ్యవస్థలను నడపడానికి ఎంపికచేసే సిబ్బంది జాబితాను ప్రకటించాలనికూడా కమిషన్ ఆ లేఖలో పేర్కొన్నది.

 

జాతీయ పునరావాస విధానాన్ని (ఎన్ ఆర్ పి) పరిశీలించే విషయంలో , మహిళా శిశు సంక్షేమ శాఖ, సామాజిక న్యాయ శాఖ, కార్మిక శాఖ, మానవ వనరుల శాఖలకు చోటుకల్పించాలని కమిషన్ పేర్కొన్నది. తరలింపునకు గురయ్యే ప్రతి కుటుంబంలోని పిల్లల ఆరోగ్య పరిస్థితికి, పోషకాహార స్థాయికి, విద్యా స్థాయికి సంబంధించి, తప్పనిసరిగా సర్వే నిర్వహించి, జాబితా(వయస్సు, లైంగికత వారీగా) రూపొందించాలన్న కొత్త నిబంధనను ఎన్ ఆర్ పి లో చేర్చాలనికూడా కమిషన్ పట్టుపడుతున్నది. విద్యకు సంబంధించి, పాఠశాల చదువు, ముఖ్యంగా ఏ తరగతి చదువుతున్నది ఆ సర్వే వివరంగా పేర్కొనాలని, తద్వారా, ఆ పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోకుండా చదువుకొనసాగించే ఏర్పాటు తప్పనిసరిగా జరగాలని కమిషన్ పేర్కొంటున్నది.

 

పునరావాస ప్రణాళికలో, అవసరమైనన్ని పాఠశాలలు, హాస్టళ్ళు, ఐ సి డి సి కేంద్రాలు, బ్రిడ్జ్ స్కూల్స్ ఏర్పాటుచేయడానికి, వీటి నిర్వహణకు అవసరమయ్యే వనరుల కేటాయింపునకు పునరావాస వ్యవహారాల అడ్మినిస్ట్రేటర్ బాధ్యత వహించవలసి వుంటుందని కమిషన్ పేర్కొన్నది.

 

కుటుంబాల తరలింపునకు, పునరావాస కల్పనకు మధ్య వుండే వ్యవధిలో, పిల్లల ఆరోగ్యానికి, పోషకాహారానికి, చదువునకు సంబంధించిన హక్కులకు భంగంఏర్పడే పరిస్థితి తలెత్తితే, వారికి పాఠశాలలలో, ఐ సి డి సి కేంద్రాలలో తాత్కాలికంగా చోటు కల్పించాలని కమిషన్ స్పష్టంచేసింది. బాలల హక్కుల ఉల్లంఘన, వాటి నివారణకు తీసుకున్న చర్యలగురించి ఎన్ సి పి సి ఆర్ కు నిర్దిష్ట కాల వ్యవధిలో తప్పక తెలియజేయాలనికూడా కమిషన్ కోరింది.

 

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మార్గదర్శకాలు

 

బాల కార్మిక (నిషేధ, క్రమబద్ధీకరణ) చట్టం-1986, 15 వృత్తులలో, 57 పనులలో (షెడ్యూల్- ఏ, బి విభాగాలు) బాల కార్మికత్వాన్ని నిషేధిస్తున్నది. ఈ నిబంధనను ఉల్లంఘించి, పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై కార్మిక శాఖ కేసులను నమోదు చేయాలి. పిల్లలను పనిలో పెట్టుకోవాలనుకునే యజమానులకు కఠినమైన హెచ్చరికలు జారీచేయాలి. దీనిని ఒక ఉద్యమంలా చేపట్టి, నమోదైన కేసులను ప్రాంతాలవారీగా, ప్రణాళికాబద్ధంగా, సంచార న్యాయస్థానాలద్వారా పరిష్కారమయ్యేలా చూడాలి నిరాదరణకు గురైన, నేరాలకుపాల్పడిన బాలల సంక్షేమానికి (ఆదరణ, సంరక్షణ, అభివృద్ధి, పునరావాసం) ఉద్దేశించిన బాలల న్యాయ చట్టం (జువెనైల్ జస్టిస్ యాక్ట్...జె జె చట్టం) -2006 పరిధిలోకి, బాల కార్మికులు కూడా వస్తారు. సెక్షన్ 2 (డి) (1ఎ) లో, " ఆదరణ చూపవలసిన, సంరక్షించవలసిన బాలలు '' అనే నిర్వచనంకింద, ' పనిచేసే పిల్లలు ' అనే ప్రస్తావన కూడా వుంది. జె జె చట్టం, సెక్షన్ 2 (కె) , '' బాలలు '' అంటే, 18 ఏళ్ళు నిండనివారు అని నిర్వచించింది. అందువల్ల, కేవలం 14 ఏళ్లలోపు బాలలను పనిలోపెట్టుకోవడాన్ని మాత్రమే నిషేధించే బాల కార్మిక చట్టంకంటె, 18 ఏళ్ళు నిండేవరకు పిల్లలందరికి, తగిన సంరక్షణను, ఆదరణను అందించే ఈ చట్టం మరింత విస్తృతంగా ప్రయోజనదాయకమైంది. మరో విధంగా చెప్పాలంటే, బాల కార్మిక చట్టంలో నిషేధింపబడని బాల కార్మికత్వం కూడా, జెజె చట్టం పరిధిలోకి వస్తుంది. పిల్లలను పనిలోపెట్టుకునే యజమానులపై కేసులు పెట్టడానికి, వెట్టి చాకిరి నిర్మూలన చట్టం (బాండెడ్ లేబర్ సిస్టం అబాలిషన్ యాక్ట్)-1976 ను ప్రయోగించాలి. ఎందుకంటె, యజమానులనుంచి తమతల్లిదండ్రులు ముందస్తుగా తీసుకున్న సొమ్ము (బయానా...అడ్వాన్స్) కు బదులుగానే, చాలామంది పిల్లలు పనిచేస్తున్నారని తేలింది. వీరుకూడా చాలావరకు, వలసవెళ్ళిన కార్మికులుగా పనిచేస్తున్న సందర్భాలే ఎక్కువ. ఈ చట్టం కింద ఏర్పాటయ్యే నిఘా సంఘాలను ( విజిలెన్స్ కమిటీలను) చైతన్యపరచాలి; రెవిన్యూ, కార్మిక శాఖలు చట్టాన్ని కచ్చితంగా అమలు జరపాలి. కేసులు నమోదుచేయడానికి వయస్సుకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవని, పిల్లల తలిదండ్రులకు ఎలాంటి బయానా (అడ్వాన్స్) చెల్లించలేదని నిరూపించుకోవలసిన బాధ్యత ఆ యజమానిపైనే వుంటుందని గమనించడం అవసరం. ఇంతేకాకుండా, ఎవరైనా దళారీ (కాంట్రాక్టర్) ?

Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions